రాజన్న లడ్డూ సిద్ధం
వేములవాడ: కోరిన కోర్కెలు తీరుస్తూ ... కొంగుబంగారంగా నిలుస్తున్న వేములవాడ రాజన్న లడ్డూ ప్రసాదానికి భక్తుల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజన్న దర్శనం అనంతరం లడ్డూ ప్రసాదాన్ని కొనుగోలు చేసి తీసుకెళ్లి బంధువులు, చుట్టూ పక్కల వారికి ఇవ్వడం ఆనవాయితీగా భావిస్తారు. లడ్డూ ప్రసాదం పంపిణీ చేయడం ఆధ్యాత్మిక భావనను విస్తరించడంతోపాటు ప్రసాదాన్ని తీసుకున్న వారు సైతం చాలా పవిత్రంగా భావిస్తూ స్వీకరిస్తారు. ఇంత ప్రాశస్థ్యం గల లడ్డూ ప్రసాదాన్ని ఆలయ అధికారులు యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేయిస్తున్నారు. వేములవాడ రాజన్న ఆలయంలో ఈనెల 25, 26, 27 తేదీల్లో నిర్వహించే మహాశివరాత్రి జాతరకు 4 లక్షల వరకు భక్తుఉల వస్తారని అంచాన వేశారు. ఇందుకు అనుగుణంగా దాదాపు 5 లక్షల లడ్డూలను తయారీ చేయిస్తున్నారు. ఇప్పటికే 3 లక్షల లడ్డూలు సిద్ధం చేసి ఉంచగా, మరో 2 లక్షల లడ్డూలను సిద్ధం చేస్తున్నారు. రూ.20కి ఒక లడ్డూ చొప్పున విక్రయిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొన్ని ఆంధ్రాబ్యాంక్ భవనంలో అదనంగా లడ్డూ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. రాజన్నను దర్శించుకుని దక్షిణ ద్వారం ద్వారా బయటకు వెళ్లే భక్తులు నేరుగా ప్రసాదాల కౌంటర్‌కు చేరుకోవచ్చు.
భక్తుల కోసం తయారీ
రూ.20కి ఒకటి
వేములవాడలో 25 నుంచి మహాశివరాత్రి జాతర
4 లక్షల భక్తులు వస్తారని అంచనా
ఏటా పెరుగుతున్న ఆదాయం
2014–2015 రూ.7.30 కోట్లు
2015–2016 రూ.8.89 కోట్లు
2016–2017 రూ.8.38 కోట్లు
2017–2018 రూ7.88కోట్లు
2019–2020 రూ.6.95 కోట్లు
2020–2021 రూ.11.42 కోట్లు
2021–2022 రూ.11.46 కోట్లు
2022–2023 రూ.11.50 కోట్లు
2023–2024 రూ.11.60 కోట్లు
5 లక్షల లడ్డూలు
జాతరకు వచ్చే భక్తులకు రాజన్న ప్రసాదం అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో ఈసారి 5 లక్షల లడ్డూలు సిద్ధం చేయిస్తున్నాం. ఇప్పటికే 3 లక్షల లడ్డూలు రెడీ అయ్యాయి. జాతర సందర్భంగా మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.
– శ్రవణ్, ఏఈవో, గోదాం ఇన్‌చార్జి
రాజన్న లడ్డూ సిద్ధం
Comments
Please login to add a commentAdd a comment