పట్టభద్రుల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం
● మంత్రి శ్రీధర్‌బాబు
ధర్మపురి: పట్టభద్రుల సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ధర్మపురిలోని బ్రాహ్మణ సంఘ భవనంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో నిరుద్యోగుల నైపూణ్యాన్ని పెంచేలా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభించామని పేర్కొన్నారు. విద్యారంగ అభివృద్ధి, పట్టభద్రుల సమస్యలను తీర్చే బాధ్యత కాంగ్రెస్‌దేనని గుర్తు చేశారు. అంతకముందు విప్ అడ్లూరి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన అభ్యర్థి నరేందర్‌రెడ్డిని గెలిపిస్తే పట్టభద్రుల సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. ఉద్యోగాలకు కల్పతరువుగా ఉన్న ధర్మపురిలో శ్రీలక్ష్మీనృసింహ సంస్కృతాంధ్ర కళాశాలను మంత్రి శ్రీధర్‌బాబు చొరవతో ముఖ్యమంత్రితో మాట్లాడి తెరిపించానని వివరించారు. రానున్న రోజుల్లో ధర్మపురిలో ఐటీఐ, డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చిలుముల లావణ్య, నాయకులు ఎస్.దినేశ్, వేముల రాజు, చిలుముల లక్ష్మణ్, చీపిరిశెట్టి రాజేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment