కరీంనగర్ మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా గీతారెడ్
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది రూపిరెడ్డి విశ్వ గీతారెడ్డిని కరీంనగర్ నగరపాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్‌గా(న్యాయవాదిగా)నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం జీవో జారీ చేసింది. సీనియర్ న్యాయవాది అయిన గీతారెడ్డి గతంలో ప్రభుత్వ ప్లీడర్(జీపీ)గా, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు. ప్రస్తుతం విద్యుత్‌శాఖకు స్టాండింగ్ కౌన్సిల్‌గా కొనసాగుతున్నారు. ఇకనుంచి మున్సిపల్ పక్షాన కోర్టుల్లో గీతారెడ్డి వాదనలు వినిపించనున్నారు. గీతారెడ్డి నియామకంపై బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రఘునందన్‌రావు, సీనియర్ న్యాయవాదులు సింగిరెడ్డి లక్ష్మారెడ్డి, ఎడమ శ్రీరంగారెడ్డి, ఉప్పుల అంజనిప్రసాద్, రూపిరెడ్డి దేవేందర్‌రెడ్డి, పలువురు లాయర్లు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment