నలుగురు బాలికల అదృశ్యం
● తల్లిదండ్రులకు అప్పగించిన వన్‌టౌన్ పోలీసులు
కరీంనగర్ క్రైం: నగరానికి చెందిన నలుగురు బాలికలు రెండు రోజుల క్రితం అదృశ్యం అయ్యారు. వారి జాడ గుర్తించిన కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు క్షేమంగా ఇంటికి చేర్చారు. ఈ నెల 09న వన్‌టౌన్ పోలీసులకు నలుగురు బాలికలు అదృశ్యం అయ్యారని ఫిర్యాదు వచ్చింది. దర్యాప్తు చేసిన పోలీసులు గుంటూరులో బాలికలను గుర్తించి కరీంనగర్ తీసుకొచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. బాలికలు తరచూ ఫోన్లు చూస్తుండడంతో మందలించడంతోనే ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
సిరిసిల్లక్రైం: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం సుందరయ్యనగర్‌కు చెందిన నాయిని రాజయ్య (59) రోడ్డు ప్రమాదంలో మంగళవారం మృతి చెందాడు. పోలీసులు వివరాల ప్రకారం.. రాజయ్య సైకిల్‌పై వెల్జిపూర్ వెళ్తుండగా సిరిసిల్ల బ్రిడ్జి వద్ద వెనకనుంచి బైక్ ఢీకొట్టింది. ఈప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజయ్యను సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రి, అక్కడి నుంచి కరీంనగర్ తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. మృతుడి చిన్న కొడుకు రమేశ్ ఫిర్యాదు మేరకు కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన శీతల్లి మనోహర్‌ను నిందితుడిగా గుర్తించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణ తెలిపారు.
కుక్కల దాడిలో బాలుడికి గాయాలు
శంకరపట్నం: శంకరపట్నం మండలంలో వీధికుక్కల దాడిలో మరో బాలుడికి తీవ్రగాయాలు అయ్యాయి. మండలంలోని వంకాయగూడెం గ్రామానికి చెందిన శ్రేయాన్స్(4) ఇంటిఎదుట ఆడుకుంటుండగా వెన్నులో కుక్క కరిచి గాయపర్చింది. తాడికల్‌లో కృత్విక్‌ను కరిచిన కుక్క వంకాయగూడెం వచ్చి శ్రేయాన్స్‌ను కరిచిందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. శ్రేయాన్స్‌కు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించారు.
గంజాయి విక్రేతల అరెస్ట్
కరీంనగర్‌క్రైం: నగరంలోని హౌజింగ్‌బోర్డుకాలనీలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిట్లు కరీంనగర్ త్రీటౌన్ పోలీసులు తెలిపారు. పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న పోలీసు ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద రూ.3000 విలువైప 1.460 కిలోల గంజాయి చాక్లెట్లు లభించినట్లు వెల్లడించారు. నిందితులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహేశ్‌కుమార్ గౌతమ్‌గా గుర్తించినట్లు పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment