కాలువలోపడి వ్యక్తి మృతి
గోదావరిఖని: మల్కాపూర్ గ్రామానికి చెందిన మానాల వెంకటేశ్(47) మంగళవారం ప్రమాదవశాత్తు మురుగునీటికాలువలోపడి మృతి చెందాడని వన్‌టౌన్ ఎస్సై రమేశ్ తెలిపారు. ఉదయం పని కోసం స్కూటీపై వెళ్తూ అదుపుతప్పి కాలువలో పడి మృతి చెందాడు. మృతుడి భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. మృతునికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
ఉరేసుకొని ఆత్మహత్య
మానకొండూర్: మండలంలోని పోచంపల్లికి చెందిన పొలం అంజయ్య (53) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పొలం అంజయ్య వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తల్లి 15 ఏళ్ల క్రితం చనిపోయింది. అప్పటి నుంచి అంజయ్య ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. కుటుంబ సభ్యులు అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడేందుకు పలు ఆస్పత్రులు తిరిగి వైద్యం చేయించారు. రెండు నెలలనుంచి మళ్లీ అంజయ్య ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున అంజయ్య ఇంట్లో కనిపించకపోవడంతో కుమారుడు రఘు తండ్రి కోసం వెతకగా ఇంటి ముందు చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
అనారోగ్యంతో ఒకరు..
సైదాపూర్: మండలంలోని ఆకునూర్ శివారు భూషణగట్ల వద్ద బండోజు నర్సింహాచారి(50) చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సైదాపూర్ ఎస్సై తిరుపతి వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ గ్రామానికి చెందిన బండోజు నర్సింహాచారి అనారోగ్య సమస్యలతో జనవరి 7న హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి వెళ్లాడు. చికిత్సకు సుమారు రూ.5లక్షలు అవుతుందని వైద్యులు తెలిపారు. అంతడబ్బు ఎక్కడి నుంచి తేవాలని మనస్తాపం చెందాడు. ఆ మర్నాడు రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. నర్సింహాచారి కనిపించడం లేదని హుస్నాబాద్ పోలీసులకు ఆయన కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. సైదాపూర్ మండలం ఆకునూర్ శివారు భూషణగట్ల వద్ద చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడని సర్వాయిపేట గ్రామానికి చెందిన దేవయ్య మంగళవారం ఇచ్చిన సమాచారంతో కుటుంబసభ్యులు నర్సింహాచారి మృతదేహంగా గుర్తించారు. నర్సింహాచారికి ముగ్గు రు కూతుర్లు ఉన్నారు. చిన్న అల్లుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
జ్వరంతో బాలిక మృతి
హుజూరాబాద్ : మండలంలోని చెల్పూర్ గ్రామానికి చెందిన బండారి రమ్య (14) తీవ్ర జ్వరంతో బాధపడుతూ మంగళవారం మృతిచెందింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... రమ్య గ్రామంలోని జెడ్పీ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. 20 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా హన్మకొండలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సోమవారం రాత్రి తీవ్ర జ్వరంతో బాధపడుతూ మంగళవారం ఉదయం మృతిచెందింది. రమ్య తండ్రి బండారి పెద్ద రమేశ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
కాలువలోపడి వ్యక్తి మృతి
కాలువలోపడి వ్యక్తి మృతి
కాలువలోపడి వ్యక్తి మృతి
Comments
Please login to add a commentAdd a comment