వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలి
కరీంనగర్ సిటీ: ప్రతీమహిళ, విద్యార్థులు వారికి సంక్రమించే వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ వరలక్ష్మి సూచించారు. నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల హెల్త్‌క్లబ్ ఆధ్వర్యంలో కళాశాలలోని ఆడిటోరియంలో కేన్సర్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ ఆంకాలజిస్ట్ అర్చనరెడ్డి హాజరై మహిళలకు ఎక్కువగా వచ్చే కేన్సర్లపై అవగాహన కల్పించారు. రొమ్ము, గర్భాశయ కేన్సర్ మహిళలకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించాలన్నారు. హెల్త్‌క్లబ్ కో–ఆర్డినేటర్ నాజియా రహమాన్, ఎన్‌సీసీ ఇన్‌చార్జి స్రవంతి పాల్గొన్నారు.
వర్క్‌షాప్‌తో మెరుగైన బోధన
కరీంనగర్ సిటీ: వర్క్‌షాప్‌తో అయా పాఠ్యంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకుని, మెరుగైన బోధనకు అవకాశం ఉంటుందని శాతవాహన వీసీ డా.ఉమేశ్‌కుమార్ తెలిపారు. శాతవాహన విశ్వవిద్యాలయ సైన్స్‌కళాశాల రసాయనశాస్త్ర విభాగంలో మంగళవారం వర్క్‌షాప్ నిర్వహించారు. డిగ్రీస్థాయిలో రసాయనశాస్త్ర సబ్జెక్టు బోధించే అధ్యాపకులకు ‘రీఇన్ఫో ర్స్ నాలెడ్జ్ ఆఫ్ ప్రాక్టికల్ ప్రొసీజర్స్ ఇన్ కెమి స్ట్రీ’ అంశంపై అవగాహన కల్పించారు. ప్రిన్సి పాల్ జయంతి ఆధ్వర్యంలో రిసోర్స్ పర్సన్స్ పీ.వీరసోమయ్య, కోటేశ్ రసాయనశాస్త్రంలోని మెలకువలను వివరించారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జాస్తి రవికుమార్ మాట్లాడుతూ కార్యశాలతో నైపుణ్యలు పెంచుకోవచ్చని తెలిపారు.
పురుగు మందుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి
తిమ్మాపూర్: జిల్లాలోని పురుగు మందుల విక్రయాల డీలర్లు వారి స్టాక్ వివరాలను వ్యవసాయశాఖ రూపొందించిన యాప్‌లో ఈనెల 15లోగా నమోదు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి సూచించారు. తిమ్మాపూర్‌లోని రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమానికి డీఏవో హాజరయ్యారు. అనంతరం పురుగు మందుల విక్రయ డీలర్లతో సమావేశం నిర్వహించారు. యాప్‌లో వివరాల నమోదు గురించి అవగాహన కల్పించారు. ఏవోలు సురేందర్, కిరణ్మయి, రమ్యశ్రీ, డీలర్లు పాల్గొన్నారు.
క్వింటాల్ పత్తి రూ.7,150
జమ్మికుంట: జమ్మికుంట మార్కెట్లో క్వింటాల్ పత్తి గరిష్టంగా రూ.7,150 పలికింది. మార్కెట్‌కు 19వాహనాల్లో 290క్వింటాళ్ల పత్తిని రైతులు తెచ్చారు. మోడల్ ధర రూ.7,100, కనిష్ట ధర రూ.6,700కు వ్యాపారులు కొనుగోలు చేశారు. కార్యదర్శులు పర్యవేక్షించారు.
వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలి
వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలి
Comments
Please login to add a commentAdd a comment