ఆక్యుపంక్చర్‌తో మెరుగైన ఫలితాలు
కరీంనగర్‌క్రైం: ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్ వంటి ప్రత్యామ్నాయ వైద్య విధానాల ద్వారా మందుల అవసరం లేకుండానే అనేక రకాల వ్యాధులను అధిగమించి మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ తెలిపారు. సంకల్ప ఆయుర్వేదిక్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ హైదరాబాద్‌వారి సహకారంతో, కరీంనగర్ బార్ అసోసియేషన్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో మంగళవారం ఉచిత ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్ శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా జడ్జి ప్రతిమ మా ట్లాడుతూ నడుము, మెడనొప్పి, మోకాళ్లనొప్పులు, తలనొప్పి, సయాటికా, మైగ్రైన్, గ్యాస్ట్రిక్ వంటి అనేక సమస్యలకు ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్ వైద్య పద్ధతుల ద్వారా సమర్థవంతమైన చికిత్స పొందవచ్చని వివరించారు. ఈ శిబిరంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది సహా దాదాపు 400మంది వైద్య సేవలు పొందారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పీవీ.రాజ్‌కుమార్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి వెంకటేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment