స్కానింగ్ సెంటర్లలో తనిఖీలు
కరీంనగర్‌టౌన్: జిల్లాకేంద్రంలోని పలు స్కానింగ్, ఫెర్టిలిటీ సెంటర్లను మంగళవారం డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీ చేశారు. కేంద్రాల్లో స్కానింగ్ కోసం వచ్చిన అవుట్ పేషెంట్ రిజిష్టర్లు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, డాక్టర్ల క్వాలిఫికేషన్ వెరిఫికేషన్, గర్భస్థ పూర్వ, లింగ నిర్ధారణ చట్టం అమలు తీరును పరిశీలించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉమాశ్రీ, సనా, డి.లక్ష్మి, కె.రమేశ్, రాజగోపాల్, విజయవాణి పాల్గొన్నారు.
పీహెచ్‌సీల్లో డెలివరీలు పెంచాలి
ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో డెలివరీల కోసం వచ్చే విధంగా సదుపాయాలు కల్పించాలని డీఎంహెచ్‌వో వెంకటరమణ అన్నారు. మంగళవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మైక్రో యాక్షన్ ప్లాన్ తయారు చేసి ప్రతీఒక్క చిన్నారికి పూర్తివ్యాధి నిరోధక టీకాలు 100శాతం జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈనెల 17నుంచి 30వరకు జరిగే కుష్టువ్యాధి కేసు గుర్తింపు క్యాంపుల్లో అందరూ పాల్గొనేలా చూడాలన్నారు. అతుల్‌వాసరే, సుదా రాజేంద్ర, ఉమాశ్రీరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment