మెస్‌చార్జీల పెంపుతోనే పౌష్టికాహారం
● ‘సుడా’ చైర్మన్ నరేందర్‌రెడ్డి
కరీంనగర్ కార్పొరేషన్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెస్‌చార్జీలు పెంచడంతోనే హాస్టల్ విద్యార్థులకు పౌష్టికాహారం సాధ్యమైందని సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం నగరంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను సందర్శించారు. వంటశాలలోని సరుకులు తనిఖీ చేశారు. వంటకాలను పరిశీలించారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో చాలీచాలని మెస్ చార్జీలతో విద్యార్థులకు పౌష్టికాహారం అందించే పరిస్థితి ఉండేది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మెస్‌చార్జీల పెంపుతో ఆ పరిస్థితి పోయిందన్నారు. విద్యార్థులకు అందించే భోజనం విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని ఆయన ప్రిన్సిపల్‌కు సూచించారు. మెనూ అమలు చేస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్, నాయకులు మిరాజ్, కొరివి అరుణ్‌కుమార్, శ్రావణ్‌నాయక్, కుర్ర పోచయ్య, పెద్దిగారి తిరుపతి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment