
కోరుట్లలో పట్టపగలే దొంగతనం
● రూ.4 లక్షలు, రెండున్నర తులాల బంగారం చోరీ
కోరుట్ల: పట్టణంలోని రాంనగర్ ప్రాంతంలో బుధవారం పట్టపగలే దొంగలు తాళం వేసిన ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. పట్టణానికి చెందిన ఐలారం పద్మ బట్టల దుకాణం నడుపుతోంది. కూతురు ఇంటర్ పరీక్ష రాసేందుకు వెళ్లగా.. పద్మ ఇంటికి తాళం వేసి దుకాణానికి వెళ్లింది. పద్మ కూతురు పరీక్ష రాసి ఇంటికి తిరిగి వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా.. బీరువా తాళాలు కూడా పగులగొట్టి, వస్తువులు చిందరవందరగా ఉన్నాయి. వెంటనే తల్లి పద్మకు సమాచారం ఇవ్వగా ఆమె వచ్చి బీరువాలోని రూ.4 లక్షలు, రెండున్నర తులాల బంగారం అపహరణకు గురైనట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్సై రాంచంద్రం గౌడ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.
ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
పరీక్ష కేంద్రంలో విద్యార్థినిపై పడిన ఫ్యాన్
కరీంనగర్ కాశ్మీర్‌గడ్డలోని ఓ జూనియర్ కళాశాలలో బుధవారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష రాస్తుండగా శివాన్విత అనే విద్యార్థిని తలపై సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. కన్ను, ముక్కుకుపై గాయాలయ్యాయి. పరీక్ష కేంద్రంలో ఉన్న ఏఎన్‌ఎంలు ప్రథమ చికిత్స చేశారు. పరీక్ష సమయం వృథాకావడంతో విద్యార్థినికి మరో 30నిమిషాలు అదనంగా సమయం ఇచ్చారు. విషయం తెలుసుకున్న సీపీ గౌస్ ఆలం వచ్చి విద్యార్థినిని పరామర్శించారు. ఈ ఘటనపై కేంద్రం ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన చేయడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్

కోరుట్లలో పట్టపగలే దొంగతనం
Comments
Please login to add a commentAdd a comment