
ఆన్‌లైన్ పెట్టుబడిదారుడి ఇంటి ఎదుట ఆందోళ
జగిత్యాలక్రైం: జగిత్యాలలో ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెట్టించి తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తి ఇంటిముందు బాధితులు బుధవారం ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి కొడిమ్యాలకు చెందిన కొంతమంది నుంచి సుమారు రూ.70 లక్షల వరకు ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెట్టించాడు. కొంతకాలంగా ఆన్‌లైన్ పెట్టుబడి వ్యాపారం మూతపడటంతో తమకు తమ డబ్బులు చెల్లించాలని బాధితులు కోరుతున్నారు. వారికి పొంతనలేని సమాధానాలు చెబుతూ వచ్చిన సదరు వ్యక్తి తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో బాధితులు ఆయన ఇంటి ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు సంఘటనస్థలానికి వచ్చి బాధితులతో మాట్లాడి స్టేషన్‌కు తీసుకెళ్లారు. అదే సమయంలో పెట్టుబడి పెట్టించిన సదరు వ్యక్తి రావడంతో బాధితులు అతడితో వాగ్వాదానికి దిగారు.
Comments
Please login to add a commentAdd a comment