కాంగ్రెస్‌తోనే సాగునీటి సమస్య
కరీంనగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ వైఖరి వల్లే రైతులు సాగునీటి కోసం ఉద్యమించడం, ఉపాధి కోసం వలసలు వెళ్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రామగుండం నుంచి గజ్వేల్‌లోని ఎర్రవెల్లి ఫాంహౌజ్ వరకు చేపట్టిన పాదయాత్ర జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకోగా బీఆర్‌ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సేఫ్‌గా ఉందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటూనే నీటి మళ్లింపు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం రైతాంగాన్ని నట్టేట ముంచడమేనన్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ బడ్జెట్‌ను ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు పోరాటాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ రఘువీర్ సింగ్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, బీఆర్‌ఎస్ నాయకులు జంగిలి ఐలేందర్‌యాదవ్, మెతుకు దేవరాజు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment