పంపుహౌస్ వద్ద రైతుల నిరసన
ధర్మారం(ధర్మపురి): నంది మేడారం రిజర్వాయర్ నుంచి ఎల్లంపల్లి పైప్‌లైన్ ద్వారా గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్‌కు నీటిని తరలించటాన్ని నిరసిస్తూ మేడారం ఎల్లంపల్లి పంప్‌హౌస్ వద్ద రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాసూరి శ్రీధర్, మాజీ ఎంపీటీసీ మిట్ట తిరుపతి వారికి మద్దతు ప్రకటించారు. ఏఈఈ అఖిల్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. అయినా, రైతులు వినలేదు. మేడారం రిజర్వాయర్‌లో నీటి మట్టం తగ్గకుండా.. పూర్తిస్థాయి సామర్థ్యంలో నీటిని నింపిన తర్వాతే ఇతర ప్రాంతాలకు తరలించాలని రైతులు డిమాండ్ చేశారు. పరిస్థితిని ఏఈఈ అఖిల్ డీఈ బుచ్చిబాబుతో మాట్లాడి వివరించగా మరో మోటార్‌ను ఆన్‌చేస్తామని హామీ ఇవ్వటంతో రైతులు ఆందోళన విరమించారు.
నీటి నిల్వలు పెంచాకే పంపింగ్ చేయాలని డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment