షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
● రూ.50వేలు ఆర్థికసాయం అందించిన కలెక్టర్
సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్టతండాలో అంగోతు రాములు ఇల్లు బుధవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైంది. ఇంట్లో నిల్వచేసిన ధాన్యం, వంట సామగ్రి, విలువైన వస్తువులు, బట్టలు బూడిదయ్యాయి. రాములు కుమారుడు గణేశ్ చదువుకుంటున్న సర్టిఫికెట్లు కూడా కాలిపోయాయి. సమాచారం అందుకున్న ఏఎంసీ చైర్మన్ సాబేరా బేగం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య పరామర్శించారు. ఈ విషయం కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా దృష్టికి వెళ్లడంతో వెంటనే ప్రభుత్వం తరఫున రూ.50వేల చెక్కును అందజేశారు.
ప్రమాదంలో తండ్రి మృతి..
పరీక్ష రాసిన తనయుడు
సైదాపూర్: అల్లారుముద్దుగా పెంచిన తండ్రి శవం ఇంటి వద్ద ఉండగా.. ఆయన ఆశయాలు నెరవేర్చేందుకు తనయుడు ఇంటర్ పరీక్షకు హాజరయ్యారు. సైదాపూర్ మండలం ఆరెపల్లికి చెందిన బూర్గుల రాజేశ్వర్‌రావు కరీంనగర్‌లో ఓ ప్రైవేట్ కంపెనీ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. గత నెల 24న సాయంత్రం డ్యూటీ కోసం కరీంనగర్ వెళ్తుండగా మానకొండూర్ ప్రాంతంలో బైక్ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ సీఎస్‌ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. బుధవారం మృతిచెందాడు. తండ్రి మృతదేహం ఇంటి వద్ద ఉండగా.. తనయుడు అంజి ఇంటర్ ఫస్టియర్ చివరి పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష రాసి వచ్చిన తర్వాత తండ్రికి అంత్యక్రియలు నిర్వహించాడు.
షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
Comments
Please login to add a commentAdd a comment