గుర్తు తెలియని మృతదేహం
వేములవాడఅర్బన్: వేములవాడ మండలం అగ్రహారం శివారులో 25 నుంచి 30ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. మృతుడి ఒంటిపై డార్క్ బ్లూ కలర్ నిక్కర్ ధరించి, కొద్దిగా బట్టతల, కుడి కాలుకు కడియం కలిగి ఉన్నాడు. ఎవరైన గుర్తు పట్టినట్లు అయితే వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని తెలిపారు.
ఎన్టీఆర్ చౌరస్తా డ్రైనేజీలో..
కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌లోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద గల డ్రైనేజీలో గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించినట్లు వన్ టౌన్ సీఐ బిళ్ల కోటేశ్వర్ తెలిపారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉందని అన్నారు. మున్సిపల్ జవాన్ సుంకరి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
థాయ్‌లాండ్‌లో ప్రైవేట్ ఉద్యోగి మృతి
● నేడు స్వగ్రామానికి మృతదేహం
హుజూరాబాద్: ఉద్యోగంలో ప్రతిభ కనబర్చడంతో కంపెనీ విహారయాత్రకు పంపిస్తే విధి వెక్కిరించింది. అక్కడ రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఓ వ్యక్తి చనిపోయాడు. మృతదేహం నేడు స్వగ్రామానికి రానుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన పుల్ల సృజన్(33) ఏషియన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఉద్యోగంలో ప్రతిభ కనబర్చినందుకు థాయ్‌లాండ్ విహారయాత్రకు వెళ్లేందుకు కంపెనీ ఆఫర్ చేసింది. థాయ్‌లాండ్‌కు వెళ్లిన సృజన్ జనవరి 25న అక్కడ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అక్కడే ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతదేహం శుక్రవారం స్వగ్రామానికి రానుంది. సృజన్‌కు భార్య స్నేహ, కుమార్తె ఉన్నారు.
పాతాళగంగలో పడి జమ్మికుంట విద్యార్థి..
జమ్మికుంట: పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులతో కలిసి దైవదర్శనం కోసం వెళ్లిన యువకుడు శ్రీశైలంలో నీటిలో పడి మృతి చెందాడు. ఈ ఘటన జమ్మికుంటలో విషాదం నింపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోత్కులగూడెం గ్రామానికి చెందిన సాగర్ల సుధాకర్– లక్ష్మి దంపతుల కొడుకు సాగర్ల సాయితేజ(19) హైదరాబాద్‌లో పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ నుంచి స్నేహితులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్లాడు. శ్రీశైలంలోని పాతాళ గంగవద్ద స్నానానికి వెళ్లి కాలుజారి నీటిలో మునిగి చనిపోయాడు. అక్కడివారి సమాచారంతో కుటుంబ సభ్యులు శ్రీశైలం బయల్దేరి వెళ్లారు.
గుర్తు తెలియని మృతదేహం
గుర్తు తెలియని మృతదేహం
Comments
Please login to add a commentAdd a comment