విగ్రహాల ఆవిష్కరణకు కృషి చేస్తా
తిమ్మాపూర్: మండల కేంద్రంలో మూడేళ్ల క్రితం నెలకొల్పిన మహనీయుల విగ్రహాలు ఆవిష్కరణకు నోచుకోకపోవడం బాధాకరమని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. మండలంలోని అఖిలపక్ష నాయకులు పది రోజులుగా మహనీయుల విగ్రహాల ఎదుట రిలే నిరాహార దీక్ష చేస్తుండగా బుధవారం సంఘీభావం తెలిపారు. అనంతరం ముసుగు తొలగించని విగ్రహాలను పరిశీలించారు. మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో మాట్లాడి విగ్రహాల ఆవిష్కరణకు కృషి చేస్తానన్నారు. సమస్య పరిష్కారమయ్యేందుకు అవసరమైతే ముఖ్యమంత్రిని కలుస్తానని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే చందర్, మండల అధ్యక్షుడు రావుల రమేశ్, రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. కార్యక్రమలో సుగుర్తి జగదీశ్వర్, దుండ్ర రాజయ్య, వంతడ్పుల సంపత్, మేడి అంజయ్య, ఆంజనేయులు, శంకర్ కొమురయ్య, రాములు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment