● నగరంలోని చాలా చోట్ల అంధకారం ● వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తం ● పనిచేయని ‘స్మార్ట్’ దీపాలు ● పట్టించుకోని బల్దియా అధికారులు
నగరంలోని విద్యానగర్– మల్కాపూర్ మెయిన్ రోడ్డు ఇది. ఈ రోడ్డు గుండా నిత్యం వేలాది వాహనాలు, ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. సెయింట్ జాన్స్‌స్కూల్ నుంచి శాతవాహన వర్సిటీ వరకు కొన్ని రోజులుగా వీధి దీపాలు వెలగడం లేదు. రోడ్డు గుండా ఉన్న దుకాణాలు మూసివేశాక చిమ్మచీకట్లు కమ్ముకుంటున్నాయి.
నగరపాలకసంస్థ డివిజన్లు 60 (కొత్త విలీన గ్రామాలు కాకుండా)
హౌసింగ్‌బోర్డుకాలనీలోని అంతర్గత రోడ్డు ఇది. సబ్‌స్టేషన్ పక్కనుంచి సమ్మక్క సారలమ్మ గద్దె వరకు వెళ్లే ఈ అంతర్గత ప్రధాన రోడ్డును చీకట్లు ఆక్రమించాయి. స్మార్ట్ వీధి దీపాలు వెలగకపోవడంతో ఆ ప్రాంతం అంధకారంగా మారింది.
●