సుల్తానాబాద్(పెద్దపల్లి): భవిష్యత్‌లో విద్యా రంగంలో మరిన్ని అద్భుతాలు సృ ష్టిస్తామని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి పట్టణంలోని అల్ఫోర్స్ పాఠశాలలో సమ్మోహనం వార్షికోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. విద్యాసంస్థల అధినేత మాట్లాడుతూ, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తామన్నారు. పోటీ ఏదైనా అల్ఫోర్స్ విద్యార్థులే ముందుంటున్నారని ఆయన అన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్‌లకు బానిసలై తమ భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ రంగాల్లో పతకాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య మాట్లాడు, తూగ్రామీణ ప్రాంతాల్లో సైతం కార్పొరేట్ విద్య అందిస్తున్న అల్ఫోర్స్ విద్యా సంస్థలను ప్రత్యేకంగా అభినందించాల్సిందేనన్నారు. ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాయిరి మహేందర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బిరుదు సమత, విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కందుకూరి ప్రకాశ్‌రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిలుక సతీశ్, ప్రిన్సిపాల్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
అల్ఫోర్స్‌లో అట్టహాసంగా ‘సమ్మోహనం’