గొల్లపల్లి: మండలంలోని రంగదామునిపల్లి గ్రామంలోని రిజర్వాయర్‌లో మంగళవారం గ్రామానికి చెందిన బాలుడు నేరెల్ల నరేశ్ (12) గల్లంతు అయ్యాడు. బుధవారం మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై సతీశ్ తెలిపారు. గ్రామానికి చెందిన నరేశ్ రిజర్వాయర్‌లో ఈతకు వెళ్లి ఇందులో పడి గల్లంతయ్యాడు. ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడని తండ్రి నేరెల్ల పోచయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఉరేసుకొని కాంట్రాక్టు కార్మికుడి ఆత్మహత్య
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనిలో కాంట్రాక్టు కార్మికుడు అవాంచ శివశంకర్(42) బుధవారం ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. గాంధీనగర్‌కు చెందిన శివశంకర్ ఎన్టీపీసీలో కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తున్నాడు. తండ్రి చనిపోయినప్పటి నుంచి ఒంటరిగా ఉంటూ మానసికంగా బాధపడుతున్నాడని, ఈ క్రమంలోనే ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని భార్య లహరి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మనస్తాపంతో ఒకరు..
సిరిసిల్లక్రైం: సిరిసిల్ల పట్టణంలోని మార్కండేయవీధికి చెందిన చౌటపల్లి రాము(42) బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు. కుటుంబ కలహాలతో కొద్ది రోజుల క్రితం రాము భార్య పుట్టింటికి వెళ్లింది. ఇంటిలో ఎవరూ లేని సమయాన్ని చూసి మనస్తాపంతో ఉరివేసుకున్నాడు. మృతునికి భార్యతోపాటు పదేళ్లలోపు ఉన్న ఇద్దరు కొడుకులు ఉన్నారు.
బాలుడి మృతదేహం లభ్యం