
భూ భారతితో సమస్యలు పరిష్కారం
● కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ● షానగర్‌లో రైతులకు అవగాహన సదస్సు
రామడుగు: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టంతో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ పమేలా సత్పతి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. రామడుగు మండలం షానగర్ గ్రామపరిధిలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం భూ భారతి, ఆర్‌వోఆర్ చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు. ధరణి కన్నా సౌకర్యవంతంగా భూ భారతి చట్టం ఉంటుందని, ప్రతీ సమస్య పరిష్కారానికి అవకాశం ఉంటుందని వివరించారు. అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్, ఆర్డీవో మహేశ్వర్, మండల ప్రత్యేకాధికారి అనిల్‌ప్రకాశ్, గోపాల్‌రావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేని తిరుమల, కొక్కెరకుంట సింగిల్ విండో చైర్మన్ ఒంటెల మురళీకృష్ణారెడ్డి, తహసీల్దార్ వెంకటలక్ష్మి, ఎంపీడీవో రాజేశ్వరి, ట్రైనర్ మందల ప్రేమ్‌చంద్రారెడ్డి పాల్గొన్నారు.
భవితకేంద్రం సందర్శన
రామడుగు ప్రభుత్వ పాఠశాలలోని భవిత కేంద్రాన్ని కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. దివ్యాంగ విద్యార్థులతో మాట్లాడారు. టీచింగ్ మెటీరియల్, రికార్డులు తనిఖీ చేశారు. ప్రతీ భవిత కేంద్రంలో సిబ్బంది వివరాలు తెలియజేసే బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. దేశరాజ్‌పల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. సింగిల్ విండో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. దేశరాజ్‌పల్లి పరిధిలోని ఔదర్‌పల్లిలో మంగళవారం నిర్వహించిన ఆరోగ్య మహిళ వైద్య శిబిరాన్ని కలెక్టర్ పమేలా సత్పతి, డీఎంహెచ్‌వో వెంకటరమణ పరిశీలించారు. హెల్త్ క్యాంపుల్లో మహిళలందరికీ.. అన్ని రకాల స్క్రీనింగ్ పరీక్షలు పూర్తి చేయాలని ఆదేశించారు. పీవోఎంహెచ్‌ఎన్ వైద్యాధికారి సనజవేరియా, రామడుగు వైద్యాధికారి రమేశ్, ఎంఎల్‌హెచ్‌పీ వైద్యాధికారి భాగ్యశ్రీ పాల్గొన్నారు.