
కర్ణాటక: గ్యారంటీ పథకాలకు హామీలిచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకులకు తలలో మెదడు లేదా? అని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజె ప్రశ్నించారు. ఆమె బుధవారం చిక్కమగళూరులో విలేకర్లతో మాట్లాడారు. కేంద్రం బియ్యంను గోడౌన్‌లో పెట్టింది గ్యారంటీ పథకాలకు ఖర్చు చేయడానికి కాదు. అత్యవసర పరిస్థితిలో ఉపయోగించుకోవడానికి అన్నారు.
కేంద్రం అతివృష్టి, కరువు, సాంక్రమిక వ్యాధులు సోకిన సమయంలో అత్యవసరంగా బియ్యాన్ని ప్రజలకు అందించడానికి గోదాముల్లో నిల్వ చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అరాచకత్వం మొదలైందని ఆరోపించారు. గ్యారంటీ పథకాలను ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు అది వదిలేసి బీజేపీ నాయకులపై ఆరోపణలు చేయటం సరికాదన్నారు. ప్రతి ఒక్కరికీ 10 కిలోల బియ్యాన్ని పంపిణీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.