కర్ణాటక: అధికార పార్టీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వాట్సాప్‌లో స్టేటస్ పెట్టిన మహిళా కానిస్టేబుల్ సస్పెండ్ అయిన సంఘటన చిక్కమగళూరు జిల్లా కడూరులో జరిగింది. కడూరు ఎమ్మెల్యే ఆనంద్‌కు వ్యతిరేకంగా కానిస్టేబుల్ లత.. నాకు ఏం జరిగినా ఎమ్మెల్యేదే బాధ్యత. ఎమ్మెల్యేకు నా ధిక్కారం.. అంటూ స్టేటస్ పెట్టింది. కొందరు స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో చిక్కమగళూరు ఎస్పీ ఉమా ప్రశాంత్ దృష్టికెళ్లింది.
క్రమశిక్షణ చర్యల కింద లతను సస్పెండ్ చేశారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు హెల్మెట్ లేకుండా బైక్ ర్యాలీ చేస్తుండగా లత వారికి జరిమానా విధించింది. దీనిపై ఎమ్మెల్యే అభ్యర్థి ఆనంద్ ఆమెతో వాగ్వాదానికి దిగారు. తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యే ఆనంద్ కానిస్టేబుల్ లతను కడూరు నుంచి తరీకెరెకు బదిలీ చేయించారు. ఇలా ఇద్దరి మధ్య విభేదాలున్నాయి. తన బదిలీకి సంబంధించి లత ఎస్సైతో కూడా గొడవపడింది.
Comments
Please login to add a commentAdd a comment