
కర్ణాటక: తుమకూరు జిల్లాలోని కొరటిగెరె తాలూకా చెన్నరాయనదుర్గ దగ్గర మణువినకురికె గ్రామంలో పెద్ద కొండచిలువ కలకలం రేపింది. నాగరాజు అనే రైతు మేకలను తోలుకుని వెళ్లగా ఒక మేకను కొండ చిలువ పట్టుకుని ఆరగించింది.
భుక్తాయాసంతో అక్కడి నుంచి కదలేని స్థితిలో ఉండగా చూసిన నాగరాజు ఊరి ప్రజలకు, అటవీ సిబ్బందికి సమాచారమిచ్చాడు. వారు వచ్చి దానిని పట్టుకున్నారు. ఇది 9 అడుగుల పొడవుతో సుమారు 30 కేజీల బరువు ఉంది. తరువాత దూరంగా వదిలిపెట్టారు. కొండచిలువ వల్ల నాగరాజుకు రూ.10 వేలు నష్టమైంది.
Comments
Please login to add a commentAdd a comment