మైసూరు : కొన్ని రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతి ఓ యువకుడి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. ఈఘటన మైసూరు జిల్లా పిరియా పట్టణ తాలూకా నందిపుర గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన హాలయ్యకు నలుగురు సంతానం. ఎంఏ చదివిన రెండో కుమార్తె రూపా(28)కు కొన్ని నెలల క్రితం కోణసూరుకు చెందిన దిలీప్‌తో నిశ్చితార్థం చేశారు.
రూపా రావందూరు గ్రామంలో కేపీఎస్ పాఠశాలలో గెస్ట్ లెక్చరర్‌గా పనిచేస్తోంది. నందిపుర గ్రామంలో ఇంటిపక్కనే ఉంటున్న కార్తీక్ ఎం.కే. అనే యువకుడు రూపాను వేధించేవాడు. తనను ప్రేమించాలని ఒత్తిడి చేసేవాడు. రూపా తండ్రి కూడా కార్తీక్‌ను హెచ్చరించాడు. అయినప్పటికీ వేధింపులు ఆగలేదు. దీంతో రుపా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment