నిందితులు ముసావీర్, అబ్దుల తాహ
సెల్ లొకేషన్ ద్వారా కెఫె
నిందితుల అరెస్టు
బనశంకరి: సిలికాన్ సిటీలో రామేశ్వరం కెఫెలో బాంబు పేలుడుకు పాల్పడి పరారై దొరికిన ముసావీర్ హుసేన్ షాజీబ్, అబ్దుల్ మతీన్ తాహ పశ్చిమబెంగాల్‌లో కోల్‌కతాలో దొరకడం తెలిసిందే. మొబైల్ ఫోనే వారి ఆచూకీ చెప్పిందని తెలిసింది. వివరాలు.. నిందితులు అక్కడ ఒక హోటల్‌లో పర్యాటకుల తరహాలో మకాం వేశారు. తమ మొబైల్ ఫోన్ చెడిపోవడంతో రిపేరీ చేయించడానికి ఒక మొబైల్ దుకాణానికి వెళ్లారు. రిపేరి అయిన తరువాత మొబైల్‌లో వేరే సిమ్ పెట్టి కాల్ చేసి పరిశీలించారు. ఈ సమయంలో మొబైల్ లొకేషన్ రావడంతో ఎన్‌ఐఏ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి నిర్బంధించారు.
ఆధారాలు స్వాధీనం
హోటల్‌లో రూం తీసుకునేటప్పుడు రిజిస్టర్‌లో తమ పేరురాశారు. రెండో వ్యక్తి మారుపేరు రాసి మళ్లీ కొట్టివేసి అసలైన పేరు రాసినట్లు గుర్తించారు. పర్యాటకులమని, డార్జిలింగ్ నుంచి వస్తున్నామని, చైన్నెకు వెళుతున్నామని సిబ్బందికి చెప్పారు. వారికి నకిలీ ఆధార్ కార్డు చూపారు. స్థానికంగా వివిధ స్థలాలను సందర్శిస్తూ గడిపారు. కోల్‌కతాలో మూడు హోటల్స్‌లో మకాం మార్చారు. ఆ హోటళ్ల సిబ్బంది వాంగ్మూలం, రిజిస్టర్లు, సీసీ కెమెరా ఫుటేజీలు, గుర్తింపు కార్డులు తదితరాలను ఎన్‌ఐఏ బృందాలు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment