నేడు జ్ఞానసిరి ఉత్సవాలు
బళ్లారిటౌన్: శరభేశ్వర విద్యాపీఠం ఆధ్వర్యంలో నడుస్తున్న జ్ఞానసిరి పాఠశాల, పీయూ కళాశాల ఉత్సవాలు–2025ను శనివారం సాయంత్రం గుగ్గరహట్టిలోని కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ చైర్మన్ ఎస్‌ఎం శివనాగ తెలిపారు. స్థానిక పత్రికాభవనంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు డాక్టర్ హంసరేఖ, సిటీ ఎమ్మెల్యే నారాభరత్‌రెడ్డి, వీఎస్కేయూ కులపతి ప్రొఫెసర్ మునిరాజు, శరభేశ్వర విద్యాపీఠం అధ్యక్షుడు హెచ్‌ఎం దక్షిణామూర్తి హాజరవుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులకు పోటీ పరీక్షలను నిర్వహించి ఎక్కువ మార్కులు సంపాదించిన విద్యార్థులకు బహుమతులను అందజేస్తున్నట్లు తెలిపారు. తమ విద్యాసంస్థలో 2017 నుంచి సీబీఎస్‌ఈ స్కూల్, పీయూసీ, నర్సింగ్, బీఈడీ వంటి కోర్సులను ప్రవేశ పెట్టి ఎంతో మంది విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలను పొందేలా దోహద పడిందని వివరించారు. ఈసందర్భంగా పాలనాధికారి జానకీరాముడు, వైస్ ప్రిన్సిపాల్ దేవరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment