ఇకనైనా భద్రత లభించేనా?
బనశంకరి: మైక్రో ఫైనాన్స్ సంస్థలు, రుణాలు అందించే చిన్నా చితకా సంస్థలు, వడ్డీ వ్యాపారుల దౌర్జన్యాలకు సామాన్య జనం బెంబేలెత్తిపోతోంది. రూ.20 వేలు అప్పు తీసుకుంటే వడ్డీల పేరిట బాదేసి లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారని గగ్గోలు రేగుతోంది. రుణదాతల వేధింపులను తట్టుకోలేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవడం రాష్ట్రంలో పెద్ద సమస్యగా మారడం తెలిసిందే. బలవంతపు వసూళ్లకు చెక్ పెట్టాలని సిద్దరామయ్య ప్రభుత్వం కర్ణాటక మైక్రో ఫైనాన్స్ (వేధింపుల నివారణ) ఆర్డినెన్స్–2025 ని తీసుకువచ్చింది. పలు చర్చోపచర్చల తరువాత ఆర్డినెన్స్‌కు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆమోదముద్ర వేయడంతో చట్టంగా రూపుదాల్చింది.
గ్యారంటీ లేకుండా అప్పులివ్వాలి
చట్ట ప్రకారం మైక్రో ఫైనాన్స్ సంస్థలు రుణగ్రహీతల నుంచి ఎలాంటి గ్యారంటీ తీసుకోరాదని సర్కారు ఆదేశించింది. ఇంటిని, ఆస్తుల పత్రాలను పెట్టుకుని రుణాలు ఇవ్వకూడదని తెలిపింది. అలాగే అప్పుదారులపై విధించే వడ్డీరేటు న్యాయపరంగా ఉండాలి, లిఖితపూర్వకంగా, స్థానిక భాషలో నిబంధనలను రుణగ్రహీతలకు తెలియజేయాలి. భారతీయ రిజర్వు బ్యాంక్‌లోను , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో రిజిస్ట్రేషన్ లేని మైక్రో ఫైనాన్స్ సంస్థలకు ఈ ఆర్డినెన్స్ వర్తిస్తుంది. నమోదిత సంస్థలకు ఈ చట్టంలోని నియమాలు వర్తించవు. నమోదిత సంస్థల నుంచి 1.09 కోట్ల మంది రూ.60 వేల కోట్ల రుణాలు తీసుకున్నట్లు అంచనా. రిజిస్ట్రేషన్ కానీ ఫైనాన్స్‌ల నుంచి రూ. 40 వేల కోట్లు రుణాలు జారీ అయినట్లు అంచనా. ఎంతమంది అనేది సర్కారుతోను వివరాలు లేవు. ఫైనాన్స్ కంపెనీల వద్ద కచ్చితమైన రికార్డులు లేకపోవడమే దీనికి కారణం.
కలెక్టర్లకు వ్యాపార నివేదికలు
ఆర్డినెన్స్ ప్రకారం జిల్లాల్లో వ్యవహారాలు నిర్వహించే మైక్రోఫైనాన్స్ సంస్థలు కలెక్టర్లకు త్రైమాసిక, వార్షిక లావాదేవీల నివేదికలను అందజేయాలి. అందించకపోతే 6 నెలల జైలుశిక్ష లేదా రూ.10 వేలు జరిమానా విధిస్తారు. వివాదాల పరిష్కారానికి అంబుడ్స్‌పర్సన్స్‌ను ప్రభుత్వం నియమించవచ్చు. బలవంతపు వసూళ్ల చర్యలకు కఠిన శిక్షలు తప్పవు. 10 ఏళ్ల వరకు జైలుశిక్ష, రూ.5 లక్షలు జరిమానా విధిస్తారు. బెయిల్ కూడా దొరకదని పేర్కొన్నారు. దాడుల గురించి తెలిస్తే డీఎస్పీ స్థాయి అధికారి సుమోటోగా కేసు నమోదు చేయవచ్చు. ప్రభుత్వం నిత్యం చట్టం అమలును పర్యవేక్షిస్తూ ఆదేశాలు జారీ చేయవచ్చు.
అప్పులు ఇచ్చి, వేధించేవారికి కొత్త
చట్టంతో చెక్ పడితే మేలు
ఈ చట్టంతోనైనా బలవంతపు వసూళ్లు, దౌర్జన్యాల నుంచి బడుగులకు విముక్తి లభించాలని ప్రజాసంఘాల నేతలు కోరారు. ఈ చట్టాన్ని త్వరలోనే అమలులోకి తీసుకువస్తామని సీఎం సిద్దరామయ్య తెలిపారు. ఆర్డినెన్సులో ఉన్న నియమ నిబంధనలు నిరుపేదలు, మహిళలు, రైతులు, మహిళా స్వయం సహాయక సంఘాలు రుణాల చెల్లింపులో వేధింపులను తప్పించడానికి సహాయపడుతుంది. ఆ చట్టంలో ఉన్న ప్రకారం జరగాలని బాధితులు కోరుతున్నారు. కాగితాలపైనే ఆ చట్టం సత్తా నిలిచిపోరాదని, ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేయడం రుణగ్రహీతలకు అండగా ఉండాలని, రుణాల పేరిట దోచుకునే సంస్థలను వడ్డీవ్యాపారులను కట్టడి చేయాలని డిమాండ్లు ఉన్నాయి.
ఫైనాన్స్ సంస్థలు, వడ్డీ వ్యాపారులపై సర్కారు గురి ఫలించేనా?
ఆర్డినెన్స్‌కు ఆమోదముద్రతో చట్టరూపం
త్వరలోనే అమలులోకి: సీఎం సిద్దు
రక్షణ కోసం రుణగ్రహీతల నిరీక్షణ
ఇకనైనా భద్రత లభించేనా?
ఇకనైనా భద్రత లభించేనా?
Comments
Please login to add a commentAdd a comment