జాడలేని బిహార్ గజదొంగలు
● బీదర్ ఏటీఎం డబ్బు దోపిడీ కేసు..
దొడ్డబళ్లాపురం: బీదర్ పట్టణంలో జనవరి 16న బిహార్ దోపిడీ దొంగలు పట్టపగలు కాల్పులు జరిపి రూ. 1 కోటి నగదును ఎత్తుకెళ్లడం తెలిసిందే. కాల్పుల్లో ఓ ఉద్యోగి మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. నెలరోజులు అవుతున్నా ఇంతవరకు దోపిడీ దొంగలను పట్టుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఇప్పుడిప్పుడే కాస్త కదలిక వచ్చింది. బిహార్ దొంగలు అమన్, అలోక్‌గా గుర్తించారు. ఇద్దరి ఫోటోలను ముద్రించి వాంటెడ్ పోస్టర్‌లను విడుదల చేశారు. వారి గురించి సమాచారం ఇచ్చినా, పట్టించినవారికి రూ.5 లక్షల బహుమానం ఇస్తామని బీదర్ పోలీసులు ప్రకటించారు. నిందితుల కుటుంబ సభ్యులను నిర్బంధించి బీదర్‌కు తీసుకువచ్చారు పోలీసులు.
Comments
Please login to add a commentAdd a comment