అమ్మానాన్నలను మింగేసి.. ఆనందాలను చిదిమేసి.!
రోజూ ఒడిలో కూర్చోబెట్టుకొని గోరుముద్దలు తినిపించే అమ్మ ఎక్కడికెళ్లిందోనని ఆ చిన్నారి ఇంట్లోకి, బయటికి తిరుగుతోంది..
బయటకు వెళ్లిన నాన్న ఏదో ఒకటి తీసుకొచ్చి తినిపిస్తాడని ఆశగా అందరినీ అడుగుతోంది..ఎప్పుడూ ఎవరో ఒకరు తోడుంటారు కానీ, ఇప్పుడు అమ్మానాన్న ఇద్దరూ కనిపించకపోయే సరికి ఆ పసికందు బేలచూపులు చూస్తోంది..అయ్యో పాపం అన్నా అర్థం కాదు.. అందరూ ఎందుకు ఏడుస్తున్నారో తెలుసుకోలేదు..నా పుట్టిన రోజు అన్నారు కానీ, ఇంట్లో సందడే లేదన్నట్లుగా అందరి ముఖాల్లోకి చూస్తోంది..అవ్వాతాతలు కొత్త డ్రెస్సు చూపిస్తూ నెత్తీనోరు కొట్టుకుంటుంటే వాళ్ల చుట్టూనే తిరుగుతూ వచ్చీరాని మాటలు చెబుతోంది.. వచ్చీపోయే వారు ఎత్తుకుని లాలిస్తున్నారే కానీ, అమ్మానాన్నలను తీసుకురాలేకపోతున్నారు..
.. ఆదోని మండలం కుప్పగల్‌కు చెందిన పూజారి ఈరన్న, ఆదిలక్ష్మి దంపతుల ఒక్కగానొక్క కుమార్తె సుస్మిత పుట్టిన రోజు నేడు. దంపతులు ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఈ చిన్నారి తల్లిదండ్రుల ప్రేమను బస్సు కబళించింది.
కంటికి రెప్పలా చూసుకునే అమ్మానాన్నలు..జీవితాంతం రక్షణగా నిలిచే సోదరుడు..నాన్నకు ఆసుపత్రిలో చూపించేందుకని వెళ్లారు..త్వరగా వస్తామని చెప్పారు, ఎంతకీ ఇంటికి రారు..
ఒక్క ఫోన్ లేదు, ఎక్కడున్నారో తెలియదు..ముగ్గురు ఆడ పిల్లలు, ఇంటి వద్ద ఎదురుచూస్తున్నారు..
ఇంకా ఎప్పుడు వస్తారో, తమ కోసం ఏమి తెస్తారోనని.! ఇంతలో వచ్చిన ఓ ఫోన్ కాల్‌తో గుండె ఆగినంత పనైంది..
ఆసుపత్రికి వెళ్లిన అమ్మానాన్న ఇక తిరిగిరారని, ఆటపట్టించే అన్న, తోడూనీడగా నిలిచే తోబుట్టువు మరి లేడని..
తెలిసిన క్షణాన ఆ ఇల్లు కన్నీటి సంద్రమైంది..ముగ్గురినీ పోగొట్టుకున్న ఆ ఇంట్లో నలుగురు ఆడపిల్లలు సంతానం..
ఒకరికి పెళ్లి కాగా, మరో ముగ్గురు దిక్కులేని వాళ్లయ్యారు... కర్ణాటక రాష్ట్రం మాన్వికి చెందిన హేమాద్రి, నాగరత్నమ్మ దంపతులు తమ కుమారుడు దేవరాజ్‌తో కలిసి ఆసుపత్రికి వెళ్తూ మృత్యుఒడి చేరారు.
కర్ణాటక రాష్ట్రంలోని గంగావతి డిపోకు చెందిన బస్సు మంత్రాలయానికి 14 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఆదోని మండలం పాండవగల్ సమీపంలో కల్వర్టు వద్ద వేగాన్ని నియంత్రించుకోలేక రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. బస్సు పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లి నిలిచిపోవడంతో అందులోని ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండు కుటుంబాల్లో చీకట్లు కమ్ముకున్నాయి.
– ఆదోని టౌన్
బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ఐదుగురిని బలిగొన్న వైనం
అమ్మానాన్నలను మింగేసి.. ఆనందాలను చిదిమేసి.!
అమ్మానాన్నలను మింగేసి.. ఆనందాలను చిదిమేసి.!
అమ్మానాన్నలను మింగేసి.. ఆనందాలను చిదిమేసి.!
అమ్మానాన్నలను మింగేసి.. ఆనందాలను చిదిమేసి.!
అమ్మానాన్నలను మింగేసి.. ఆనందాలను చిదిమేసి.!
Comments
Please login to add a commentAdd a comment