నగరాభివృద్ధి ప్రతిపాదనలకు ఆమోదం
రాయచూరు రూరల్: రాయచూరు సిటీ కార్పొరేషన్ పరిధిలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని మహాత్మ గాంధీ వికాస పథకం కింద నగరాభివృద్ధికి రూ.200 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలకు సామాన్య సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించారు. మంగళవారం కార్పొరేషన్ భవనంలో మేయర్ నరసమ్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సామాన్య సమావేశంలో విపక్ష సభ్యులు మాట్లాడారు. నగరంలో శాశ్వత పనులకు నిధుల వినియోగానికి అవకాశం ఉందని కమిషనర్ జుబీన్ మహాపాత్రో సమావేశంలో సభ్యుల దృష్టికి తెచ్చారు. నగరంలో ప్రధాన రోడ్లు, ఉద్యానవనాలు, పైపులైన్లు, ఇతర ప్రధాన పనులకు అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వార్డులకు రూ.48 కోట్ల నిధులు కేటాయించామన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు, సర్కిల్ అభివృద్ధి వంటి వాటికి ప్రాధాన్యత ఉందన్నారు. నగరంలో పారిశుధ్యం, మురుగు కాలువల శుభ్రం, ఇతర పనులను చేయడానికి బీజేపీ కార్పొరేటర్లు నాగరాజ్, శరణ బసవ శశిరాజ్‌కు మద్దతు పలికారు. తాగునీటి ఎద్దడి నెలకొనకుండా చర్యలు చేపట్టాలన్నారు. సభ్యుల పదవీ కాలం ముగుస్తున్నా వాటిపై మౌనం వహించడం తగదన్నారు. సభ్యులను దూరం పెట్టి ప్రతి పాదనలు సిద్ధం చేయడం సబబా అని కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. సమావేశంలో ఉప మేయర్ సాజిద్ సమీర్, సభ్యులు జయన్న, పవన్, రత్న ప్రశాంతి, లక్ష్మి, సరోజమ్మ, జిందప్ప నాగరాజ్‌లున్నారు.
సభ్యులను దూరం పెట్టి ప్రతిపాదనలా?
కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం
వాడీవేడిగా కార్పొరేషన్
సామాన్య సమావేశం
నగరాభివృద్ధి ప్రతిపాదనలకు ఆమోదం