
బైక్‌ను ఢీకొన్న బస్సు.. ఇద్దరి మృతి
● 40 మంది ప్రయాణికులకు గాయాలు
సాక్షి,బళ్లారి: బస్సు బైక్‌ను ఢీకొని బోల్తా పడిన ఘటనలో ఇద్దరు దంపతులు దుర్మరణం చెందగా 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈఘటన ముధోళ తాలూకా ముగళకోడ గ్రామ సమీపం జరిగింది. గ్రామానికి చెందిన శంకరప్ప(55) శ్రీదేవి(45) దంపతులు ఉగాది పర్వదినం పురస్కరించుకొని ముందు రోజు అమావాస్య సందర్భంగా పొలంలో పూజలు చేసేందుకు బైక్‌లో వెళ్లారు. తిరిగి వస్తుండగా యాదగిరి జిల్లా చిక్కొడికి చెందిన బస్సు బైక్‌ను ఢీకొని బోల్తా పడింది. ప్రమాదంలో దంపతులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా బస్సులో ఉన్న దాదాపు 40 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ముధోళ పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

బైక్‌ను ఢీకొన్న బస్సు.. ఇద్దరి మృతి