ఆకతాయిలపై చర్యకు డిమాండ్
సాక్షి,బళ్లారి: బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్లు తాగడం నేరమని ఆదేశాలు ఉన్నా కొందరు సిగరెట్లు తాగడం ఫ్యాషన్‌గా మార్చుకోవడంతో మహిళలు ఉన్న ప్రాంతాల్లో దగ్గరగా వెళ్లి సిగరెట్ తాగుతూ వారి ముఖం మీదకు కొందరు యువకులు పొగ వదలడం కొప్పళ జిల్లా గంగావతిలో కలకలం సృషించింది. అక్కడ వాయువిహారానికి వెళ్లిన మహిళల ముఖాలపైకి కొందరు ఆకతాయిలు సిగరెట్ తాగి పొగ వచ్చేలా చేయడంతో సదరు మహిళలు తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేస్తూ యువకులపై తీవ్రంగా మండిపడ్డారు. దీంతో సిగరెట్ తాగిన యువకులు తమ సిగరెట్ తమ ఇష్టమని, రోడ్లలో సిగరెట్ తాగితే తప్పేముందని బుకాయించడంతో పాటు మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడటంతో మరింత ఆగ్రహానికి గురి చేసింది. దీంతో శుక్రవారం గంగావతిలోని కువెంపు నగర్, జయగనర్, మాళమల్లేశ్వర తదితర కాలనీలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో చేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కాలనీల్లో తాము వాకింగ్ చేస్తున్న సమయంలో సిగరెట్ తాగుతూ తమ మీదకు పొగ వచ్చేలా చేశారని, అడ్డు చెబితే అసభ్యంగా ప్రవర్తించారని మండిపడ్డారు. తమ డబ్బులతో తాము సిగరెట్లు తాగుతున్నామని బుకాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీ కావడంతో పోలీసులు వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్లు తాగకూడదని, మరొకరికి ఇబ్బంది కలిగించే విధంగా సిగరెట్ తాగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
కుల మత తారతమ్యాలు వద్దు
రాయచూరు రూరల్: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దూసుకు పోతున్న నేటి సమాజంలో కుల, మత తారతమ్యాలను వీడాలని సీనియర్ సాహితీవేత్త మూడ్నాకూడు చిన్నస్వామి అభిప్రాయ పడ్డారు. శనివారం కన్నడ భవన ంలో కీర్తన ప్రకాశన అనిల్ పొన్నరాజ్ ఆధ్వర్యంలో తలెమారు అనే కన్నడ పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. శతాబ్దాల తరబడి అణగారిన వర్గాల వ్యక్తులు తమ జీవితాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి పుస్తకంలో నొక్కి వక్కాణించారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న అంటరానితనం నిర్మూలనపై ముమ్మర ప్రచారం అవసరమన్నారు. సమావేశంలో వెంకటేష్ బేవినబెంచి, ఈరణ్ణలున్నారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
హుబ్లీ: ప్రస్తుతం మారుతున్న సమాజంలో మహిళలకు లభించిన అన్ని అవకాశాలను సక్రమంగా సద్వినియోగం చేసుకొని ముందంజలో సాగుతూ అన్ని రంగాలలో విశిష్ట సాధన చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలని జిల్లా కౌశల్య అభివృద్ధి అధికారి దేవేంద్ర జబేరి తెలిపారు. జిల్లా కౌసల్య అభివృద్ధి శాఖ అళ్నావర పట్టణ పంచాయతీ దీనదయాళ్ అంత్యోదయ జాతీయ నగర జోవనోపాధి అభియాన్ పథకం ద్వారా స్వచ్ఛంద గ్రూప్‌ల సహకారంతో అళ్నావర వీరశైవ కళ్యాణమంటపంలో ఏర్పాటు చేసిన రెడీమేడ్ తయారీ ఎగుమతుల యూనిట్ ఆధ్వర్యంలో మహిళల కోసం ఏర్పాటు చేసిన కుట్టుమిషన్ శిక్షణ ఉద్యోగమేళా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. మహిళలకు ఉద్యోగాలు కల్పించే వ్యవస్థ ఏర్పడాలి. ధార్వాడ రాయాపుర వద్ద గార్మెంట్ యూనిట్‌లో ఈ ప్రాంతం నుంచి సుమారు 300 మంది మహిళలకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. వీటిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా స్వావలంబన సాధించాలన్నారు. సాహి ఎగుమతుల అధికారి దేవరెడ్డి హర్లాపుర, పట్టణ పంచాయతీ ముఖ్యాధికారి ప్రకాశ ముగ్ధం, మాజీ అధ్యక్షురాలు సువర్ణ, రేష్మి, రవి మునవళ్లి, సుమా, రవీంద్ర, శ్వేత పాల్గొన్నారు.
విద్యాభివృద్ధికి
సహకారం అవసరం
రాయచూరు రూరల్: గ్రామాల్లో విద్యాభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని బసవ పూర్వ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం శరణ బసవ పాటిల్ పేర్కొన్నారు. శనివారం ఆశాపూర్‌లో విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దడానికి, విద్యార్థులు ఉన్నత విద్యను పొందడానికి తమ వంతు పాటు పడాలన్నారు. ప్రతి ఒక్కరూ విద్యాభ్యాసంపై శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో అమరేష్ పాటిల్, తిమ్మప్ప, రవిలున్నారు.
మహిళల పైకి సిగరెట్ పొగ వదిలిన యువకులు
గంగావతిలో నిరసన, పోలీసులకు ఫిర్యాదు
ఆకతాయిలపై చర్యకు డిమాండ్
ఆకతాయిలపై చర్యకు డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment