ఉపకార వేతనాల రద్దు తగదు
బళ్లారిఅర్బన్: పాలక మండలి కోటాలో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉన్నఫళంగా ఉపకార వేతనాలను రద్దు చేయడం తగదని విద్యార్థులు వాపోయారు. ఈ మేరకు జిల్లాధికారికి నగరంలో వినతిపత్రం సమర్పించి సమస్యను పరిష్కరించాలని సీఎంను కోరారు. 2018–19వ సంవత్సరం నుంచి పాలక మండలి కోటాలో ఎంపికై న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలను పంపిణీ చేయక పోవడంతో ఉన్నత విద్యాభ్యాసానికి ఆటంకం కలిగిందన్నారు. దీంతో అర్థంతరంగా చదువుకు దూరం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ప్రభుత్వం సదరు నిధులను ఇతర శాఖలకు మళ్లించడం తగదని ఏకలవ్య సేన జిల్లా శాఖ ఆరోపించింది. ఒక వేళ ఆ విషయంలో తమకు న్యాయం జరగకపోతే తీవ్రమైన పోరాటం చేస్తామని ఆ సంఘం నేతలు హెచ్చరించారు.
మేకెదాటు కోసం
కరవే పాదయాత్ర
బళ్లారిఅర్బన్: రాష్ట్రంలోని తుమకూరు, చిక్కబళ్లాపుర, దొడ్డబళ్లాపుర, కోలారు, బెంగళూరు గ్రామీణ జిల్లాలకు తాగునీరు అందించే ప్రభుత్వ కీలక పథకం మేకెదాటు పథకాన్ని సత్వరం ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రామనగర నుంచి బెంగళూరు విధానసౌధకు నిర్వహించిన పాదయాత్రలో కర్ణాటక రక్షణ వేదిక(కరవే) ప్రవీణ్‌శెట్టి వర్గం పాదయాత్ర చేపట్టింది. వారికి మద్దతుగా కరవే బళ్లారి జిల్లా శాఖ హులుగప్ప సారథ్యంలో 500 మందికి పైగా కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వెంకటేష్, అసుండి సూరి, కే.ఆనంద్, వీ.వెంకటేష్, చంద్రారెడ్డి, వీరారెడ్డి, హనుమేష్ కే.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
హుబ్లీ: జైన్ అకాడమి 20వ వార్షికోత్సవం సందర్భంగా ఐఏఎస్, కేఏఎస్, గ్రూప్ సీ, ఎస్‌ఐ, బ్యాంకింగ్, రైల్వే ఉద్యోగాలకు సంబంధించి ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. దీనికి సాధారణ ప్రవేశం కల్పిస్తున్నామని ఆ మేరకు దరఖాస్తులను ఆహ్వానించారు. బెంగళూరు, ధార్వాడ కేంద్రాల్లో ఒక్కో కేంద్రంలో 100 మందికి చొప్పున శిక్షణ ఇవ్వనున్నారు. ఈనెల 25 వరకు దరఖాస్తు స్వీకరణకు గడువు ఉంది. మరిన్ని వివరాలకు 7676167901 నంబరులో సంప్రదించాలని ఆ అకాడమి డైరెక్టర్ ఓ ప్రకటనలో కోరారు.
బాల కార్మికులకు విముక్తి
రాయచూరు రూరల్: జిల్లాలో బాల కార్మికుల నియంత్రణకు శనివారం పోలీస్, కార్మిక శాఖల ఆధ్వర్యంలో అధికారులు దాడి జరిపారు. దేవదుర్గ తాలూకాకు వివిధ ప్రాంతాల నుంచి పత్తి, వరి, ఇతర పంటల కోతకు ఐదు వాహనాల్లో బాల కార్మికులను వ్యవసాయ పనులకు తీసుకెళుతుండగా ఆ వాహనాలను అడ్డుకొని 15 మంది బాలలకు విముక్తి కల్గించారు. దాడిలో బాల కార్మిక శాఖ అధికారి మంజునాథరెడ్డి, అధికారులు రాకేష్, రాజనగౌడ, వెంకటేష్, శివకుమార్‌లున్నారు.
శ్రీశైలం బస్సులు కిటకిట
రాయచూరు రూరల్: ఉగాది పండుగ సమీపిస్తున్నందున రాయచూరు నుంచి శ్రీశైలం వెళ్లే బస్సులు కిటకిటలాడుతున్నాయి. సాధారణ రోజుల్లో కన్నా ప్రస్తుతం శ్రీశైలం వెళ్లే భక్తుల సంఖ్య క్రమంగా పెరగడంతో బస్సుల్లో సీట్ల కోసం ప్రయాణికులు వెంపర్లాడుతున్నారు. ఈనేపథ్యంలో రాయచూరు, మాన్వి, సింధనూరు, దేవదుర్గ, మస్కి, లింగసూగూరు డిపోల నుంచి ప్రతి గంటకు అదనపు బస్సులను నడుతుపున్నా భక్తులు సీట్ల కోసం ఎగబడుతున్నారు. కర్ణాటకలోని బాగల్‌కోటె, విజయపుర,బ బెళగావి తదితర జిల్లాల నుంచి వెళ్లే భక్త సమూహానికి అనుకూలం కోసం ఏప్రిల్ 1వ తేదీ వరకు 15 రోజుల పాటు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు కళ్యాణ కర్ణాటక ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ఉపకార వేతనాల రద్దు తగదు
ఉపకార వేతనాల రద్దు తగదు
ఉపకార వేతనాల రద్దు తగదు
Comments
Please login to add a commentAdd a comment