తుమకూరు: కార్ల అద్దాలను పగలగొట్టి లోపల దొరికిన నగదు, నగలు, విలువైన వస్తువులను తస్కరించే ఓజీ కుప్పం దొంగల ముఠాను తుమకూరు జిల్లా గుబ్బి స్టేషన్ పోలీసులు పట్టుకన్నారు. రూ.16 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనపరచుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా ఓజీ కుప్పానికి చెందిన జీ.శివ (44), సుబ్రమణ్యం (38) అనే ఇద్దరు అరెస్టు కాగా, అంకయ్య, కిరణ్, రాజశేఖరయ్యలు పరారీలో ఉన్నారు.
క్షణాల్లో రూ.15 లక్షలు మాయం
వివరాలు.. గుబ్బికి చెందిన శివరాజు గత నెల 27న ఓ బ్యాంకు నుంచి రూ.15 లక్షలు డ్రా చేసుకుని కారులో పెట్టుకుని, ఏపీఎంసీ ముందు భాగంలో కారు నిలిపి లోపలకు వెళ్లి పని ముగించుకుని వచ్చాడు. అంతలోనే కారులోని డబ్బు, దాఖలాలు మాయమయ్యాయి. బాధితుడు గుబ్బి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాల చిత్రాలు, ఇతర ఆధారాలను సేకరించి నిందితులను అరెస్టు చేశారు. జిల్లాలోనే పలు దొంగతనాలు చేసినట్లు నోరు విప్పారు. శిరలో 2, చిక్కనాయకనహళ్లి, నొణవినకెరె, గుబ్బి స్టేషన్ల పరిధిలో 1 చొప్పున మొత్తం 5 చోరీలు చేశామని తెలిపారు. నిందితుల నుంచి కొంత నగదు, ఒక బంగారు బ్రాస్లెట్‌తో సహా రూ.16 లక్షల విలువ చేసే ఆభరణాలను జప్తు చేశారు. గుబ్బి ఇన్‌స్పెక్టర్ టీఆర్ రాఘవేంద్ర, పీఎస్‌ఐ జీకే సునీల్ కుమార్, సిబ్బంది నవీన్ కుమార్ పాల్గొన్నారు.
తుమకూరు జిల్లాలో పలు చోరీలు
రూ. 16 లక్షల సొత్తు సీజ్