రాయచూరు రూరల్: నారాయణపుర కుడి గట్టు కాలువ(ఎన్‌ఆర్‌బీసీ) ఆయకట్టు చివరి భూములకు ఏప్రిల్ నెలాఖరు వరకు నీరందివ్వాలని మాజీ మంత్రి రాజుగౌడ డిమాండ్ చేశారు. గురువారం సురపుర తాలూకా హుణసగిలోని కృష్ణా భాగ్య జల మండలి కార్యాలయం వద్ద వంద ట్రాక్టర్లతో ఆందోళన చేపట్టి మాట్లాడారు. కాలువకు మార్చి 31 వరకు నీరు వదలడానికి అధికారులు సమావేశంలో తీసుకున్న నిర్ణయంతో చేతికొచ్చిన పంటలు ఎండిపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నీటి గేజ్ నిర్వహణ సామర్థ్యాన్ని బట్టి ఆయకట్టు భూములకు నీరందేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాలువకు ఏప్రిల్ చివరి వరకు వారబందీ పద్ధతి ద్వారా నీరందించాలని కోరుతూ అధికారికి వినతిపత్రం సమర్పించారు.
ఎస్కాం డీఎస్పీగా శ్రీపాద జల్దే
హుబ్లీ: 7 జిల్లాల పరిధిలోని ఎస్కాం జాగృత దళం డీఎస్పీగా శ్రీపాద జల్దే గురువారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. 2001వ బ్యాచ్‌కు చెందిన ఈయన డీఎస్పీగా పదోన్నతి పొందక ముందు హుబ్లీ– ధార్వాడ జంట నగరాల్లోని కసబాపేట, పాత హుబ్లీ, కేశ్వాపుర, ట్రాఫిక్ స్టేషన్లలో సీఐగా, అథణిలో డీఎస్పీగా రెండేళ్లు ఉత్తమ సేవలు అందించారు.
పండుగలు శాంతియుతంగా జరుపుకోండి
రాయచూరు రూరల్: జిల్లాలో ఉగాది, రంజాన్ పండుగలను హిందూ ముస్లిం సోదరులు శాంతియుతంగా జరుపుకోవాలని అదనపు ఎస్పీ హరీష్ సూచించారు. బుధవారం సదర్ బజార్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన శాంతి సమావేశంలో మాట్లాడారు. ఈనెల 30న జరిగే ఉగాది, 31న రంజాన్ పండుగలను శాంతియుతంగా ఆచరించాలన్నారు. ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో రోజాను పాటిస్తున్నారన్నారు. హిందూ సోదరులు శాంతితో ఎలాంటి ఘర్షణలకు తావు ఇవ్వకుండా పండుగను జరుపుకోవాలన్నారు. సమావేశంలో సీఐ మేకా నాగరాజ్, ఎస్‌ఐలు మంజునాఽథ్, చంద్రప్ప, అమిత్, నరసమ్మ, శ్రీనివాస్, అంబాజీ, మహావీర్, ఇస్మాయిల్‌లున్నారు.
ఎల్‌ఎల్‌సీ నుంచి గుడదూరు వాగుకు నీరు వదలాలి
సాక్షి,బళ్లారి: తుంగభద్ర దిగువ కాలువ(ఎల్‌ఎల్‌సీ) నుంచి గుడదూరు వాగుకు నీరు వదలాలని తుంగభద్ర రైతు సంఽఘం జిల్లా అధ్యక్షుడు దరూరు పురుషోత్తం గౌడ మనవి చేశారు. ఈ మేరకు ఆయన గురువారం జిల్లాధికారి ప్రశాంత్‌కుమార్ మిశ్రాను కలిసి రైతు సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు. కంప్లి, సిరుగుప్ప నియోజకవర్గాల్లో గుడదూరు, హంద్యాళు, డి.కగ్గల్, చానాళ్, మైలాపుర, బూదుగుప్ప, హెచ్.హొసళ్లి, హాగలూరు, దరూరు, కరూరు, కారిగనూరు తదితర గ్రామాల పరిధిలో రబీలో సాగు చేసిన పంటలకు పూర్తి స్థాయిలో నీరు అందాలంటే గుడదూరు వాగుకు ప్రతి రోజు 100 క్యూసెక్కుల నీరు వదిలితే రైతుల పంటలు చేతికందుతాయన్నారు. అంతేకాకుండా పశువులకు నీరు కూడా దొరుకుతుందన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.
అక్రమ భూములపై
విచారణ శూన్యం
రాయచూరు రూరల్: జిల్లాలోని సింధనూరు తాలూకాలో గత 45 ఏళ్లుగా అక్రమంగా సాగు చేసుకుంటున్న భూములపై విచారణ ఽశూన్యమైందని సీపీఐ(ఎంఎల్) రెడ్ ఫ్లాగ్, కర్ణాటక రైతు సంఘం సంచాలకుడు మానసయ్య ఆరోపించారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవరాజ్ అరసు తెచ్చిన భూ సంస్కరణల చట్టాన్ని జారీ చేస్తామని చెబుతున్న సర్కార్లు నేటికీ మిగులు భూముల పంపిణీలో మీనమేషాలు లెక్కిస్తున్నాయన్నారు. సింధనూరు తాలూకా జవళగేరలో 1981 నుంచి 1064 ఎకరాల భూములకు వారసుదారురాలు సిద్దలింగమ్మ మరణించడంతో మాజీ మంత్రి వెంకట్రావ్ నాడగౌడ తనదే అంటూ కోర్టుల నుంచి కాలావకాశం కోరుతూ పెండింగ్‌లో ఉంచారన్నారు. ఈ విషయంలో 44 ఏళ్ల నుంచి భూ సంస్కరణల చట్టం జారీ చేయడంలో జిల్లాధికారులు భూస్వాధీనం చేసుకోవడంలో పూర్తిగా విఫలం కావడాన్ని తప్పుబట్టారు.
ఏప్రిల్ ఆఖరు వరకు నీరివ్వాలని ర్యాలీ
ఏప్రిల్ ఆఖరు వరకు నీరివ్వాలని ర్యాలీ
ఏప్రిల్ ఆఖరు వరకు నీరివ్వాలని ర్యాలీ