
రాజేశ్వరరావు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న నాయకులు
ఖమ్మంమయూరిసెంటర్: అంతరాలు లేని సమసమాజ నిర్మాణమే ధేయంగా కృషి చేసిన ఆదర్శమూర్తి చండ్ర రాజేశ్వరరావు అని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ తెలిపారు. చండ్ర రాజేశ్వరరావు 30వ వర్ధంతి సందర్భంగా ఖమ్మంలోని గిరిప్రసాద్ భవన్‌లో మంగళవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు భూమి పంపిణీ చేయడానికి కృషి చేసిన చండ్ర.. తనకు ఉన్న వందలాది ఎకరాల భూమిని సైతం పంపిణీ చేశారని తెలిపారు. 25ఏళ్ల పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలందించినా సామాన్య జీవితం గడిపారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, సింగు నర్సింహారావు, సిద్దినేని కర్ణకుమార్, రావి శివరామకృష్ణ, పోటు కళావతి, సీతామాలక్ష్మి, తాటి వెంకటేశ్వర్లు, మేకల శ్రీనివాసరావు, ఇటికల రామకృష్ణ, శివ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment