పాఠం విని.. చదువు చెప్పి !
చింతకాని: చదువుతోనే సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. జిల్లాలోని చింతకాని మండలం పందిళ్లపల్లి ఉన్నత పాఠశాలను గురువారం తనిఖీ చేసిన ఆయన ఆరో తరగతి గదిలో ఉపాధ్యాయురాలు ఇంగ్లిష్ బోధిస్తుండగా విద్యార్థులతో కలిసి విన్నారు. ఆతర్వాత ఇంగ్లిష్‌లో రాణించేలా ఎలా చదవాలో విద్యార్థులకు వివరించారు. ఆపై కంప్యూటర్ ల్యాబ్‌లో విద్యార్థులతో కలిసి డిజిటల్ ల్యాబ్‌లో నేలపై కూర్చొని వీడియో పాఠం వీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తొలి దఫా జిల్లాలోని 50 పాఠశాలల్లో కూరగాయల సాగు కోసం ఏర్పాటుచేసిన కిచెన్ గార్డెన్ల సంరక్షణ బాధ్యత విద్యార్థులే తీసుకోవాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment