మహా కుంభమేళాకు వెళ్లొచ్చాం..
వాతావరణ ం
జిల్లాలో ఆదివారం పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయి. రాత్రి మాత్రం చలిగాలుల ప్రభావం ఉంటుంది.
ఉమ్మడి జిల్లా నుంచి భారీగా తరలిన భక్తులు
● కుటుంబాలు, కాలనీల వారీగా పయనం ● త్రివేణి సంగమంలో పుణ్యసాన్నాలపై ఆసక్తి ● ఇతర పుణ్యక్షేత్రాల సందర్శన కూడా..
8లో
ఆదివారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
మరుపురానిది మహా కుంభమేళా..
మహా కుంభమేళాకు వెళ్లిరావడం ఆనందంగా ఉంది. స్నేహితులంతా కలిసి సమూహంగా వెళ్లాం. అక్కడి ప్రభుత్వం భక్తుల కోసం సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేసింది. మాకు ఎక్కడా ఇబ్బంది కలగలేదు.
– గుమ్మడవెళ్లి సంతోష్‌కుమార్, ఖమ్మం
జీవితంలో ఈ అవకాశం రాదు
144 ఏళ్లకోసారి వచ్చే మహా కుంభమేళాకు వెళ్లడం మధురానుభూతి. జీవితంలో మళ్లీ ఈ అవకాశం రాదు. మాఘ పూర్ణిమ రోజున అక్కడ పుణ్య స్నానాలు చేశాం. దేశ, విదేశాల నుంచి ఎందరో వచ్చారు. ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
– పెనుగొండ రజిత భాస్కర్, ఖమ్మం
ప్రత్యేక బస్సులు ఎంచుకుంటున్నారు
కుంభమేళాకు వెళ్లేందుకు పలు వురు బస్సులు బుక్ చేసుకున్నారు. స్లీపర్లు, సీటింగ్‌తో కూడిన బస్సులకు డిమాండ్ ఉంది. కుంభమేళాతో పాటు ఇతర యాత్రలకు 5–7రోజులు వెళ్లొస్తున్నారు.
– మిట్టపల్లి శిరీష, ట్రావెల్స్ నిర్వాహకురాలు, ఖమ్మం
ప్రయాగ్‌రాజ్‌లో టెంట్లు
ఐదు నుంచి
ఏడు రోజులు..
మహా కుంభమేళా యాత్ర పర్యటన ఐదు నుంచి ఏడు రోజుల పాటు కొనసాగుతోంది. కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించాక సమీపంలోని అయోధ్య, నైమిశారణ్యం, కాశీ వంటి క్షేత్రాలను సందర్శిస్తున్నారు. మౌని అమావాస్య, రథసప్తమి, పౌర్ణమి వంటి రోజుల్లో వెళ్లిన వారి యాత్ర అక్కడ రద్దీ కారణంగా మరో ఒకటి, రెండు రోజులు పెరిగింది.
ఖగోళశాస్త్రం ప్రకారం సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి నిర్దిష్ట రాశిలోకి వచ్చిన సమయాన కుంభమేళా జరుగుతుంది. ఇలా 144 ఏళ్లకోసారి జరిగే మహా కుంభమేళా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌లో గతనెల 13న ప్రారంభమైన మేళా ఈనెల 26న మహా శివరాత్రి వరకు కొనసాగనుంది. ఈ కుంభమేళాలో కోట్లాది మంది హిందువులు పాల్గొని అక్కడి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ మేరకు రైల్వేశాఖ దేశ నలుమూలల నుంచి ప్రత్యేక రైళ్లు ఏర్పాటుచేయగా.. జిల్లా వాసులు కొందరు రైళ్లలో, మరి కొందరు బస్సులు, కార్లు ఇతర వాహనాల్లో సమూహాలుగా వెళ్తున్నారు. ఖమ్మం నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ 1,226 కి.మీ. దూరంలో ఉండగా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మీదుగా ఓ మార్గం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ మీదుగా ఇంకో మార్గంలో వెళ్లి వస్తున్నారు.
– ఖమ్మంగాంధీచౌక్
స్లీపర్ బస్సులు..
కుంభమేళాకు పలువురు రైలు మార్గం ఎంచుకుంటుండగా.. ఇంకొందరు బస్సులు, కార్లలో వెళ్తున్నారు. మార్గమధ్యలో క్షేత్రాలను చూడొచ్చని, అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకోవచ్చనే భావనతో వాహనాలను ఎంచుకుంటున్నామని చెబుతున్నారు. ట్రావెల్స్ నిర్వాహకులు స్లీపర్‌తో పాటు సీటింగ్ బస్సులను సమకూరుస్తున్నారు. ఒక్కో బస్సులో 20 నుంచి 30 వరకు స్లీపర్ బెర్త్‌లు ఉంటున్నాయి. కాగా, సీటింగ్‌తో కూడిన బస్సులో ఒక్కొక్కరికి రూ.15,500, స్లీపర్ బెర్త్‌లు ఉంటే రూ.17,500 చొప్పున చార్జి చేస్తున్నారు. అయోధ్య, కాశీ వంటి ప్రాంతాలకు సైతం వెళ్లి వస్తే ఈ ధర మరింత పెరుగుతోంది.
అయోధ్య, కాశీకి కూడా..
ప్రయాగ్‌రాజ్ వెళ్తున్న యాత్రికులు అక్కడి నుంచి సుమారు 120 కి.మీ. దూరంలోనే ఉన్న అయోధ్యలో బాలరాముడిని సైతం దర్శించుకుంటున్నారు. అలాగే, 10 వేల ఆలయాలతో పురాతన నగరంగా విరాజిల్లుతున్న కాశీ, అక్కడి అన్నపూర్ణమ్మ ఆలయం, విశాలాక్షి, కాలభైరవ ఆలయాలను, విశ్వేశ్వర జ్యోతిర్లింగాన్ని సైతం దర్శించుకుని తిరుగుముఖం పడుతున్నారు.
శతశాతమే లక్ష్యంగా..
ఉమ్మడి జిల్లాలోని కేఎంసీ, మున్సిపాలిటీల్లో వంద శాతం ఆస్తిపన్ను వసూలు చేయడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించారు.
10లో
న్యూస్‌రీల్
మహా కుంభమేళాకు వెళ్లొచ్చాం..
మహా కుంభమేళాకు వెళ్లొచ్చాం..
మహా కుంభమేళాకు వెళ్లొచ్చాం..
మహా కుంభమేళాకు వెళ్లొచ్చాం..
మహా కుంభమేళాకు వెళ్లొచ్చాం..
మహా కుంభమేళాకు వెళ్లొచ్చాం..
మహా కుంభమేళాకు వెళ్లొచ్చాం..
మహా కుంభమేళాకు వెళ్లొచ్చాం..
Comments
Please login to add a commentAdd a comment