ఇందిరామహిళా శక్తి పథకం ద్వారా యూనిట్లు ఏర్పాటుచేసే మహిళలకు వ్యాపార విస్తరణ, లాభార్జనపై అవగాహన కల్పించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. మహిళా సంఘాలతో సమన్వయం చేసుకుంటూ స్వశక్తి మహిళా సంఘాలు రూపొందించే ఉత్పత్తుల అమ్మకానికి మహిళా మార్ట్ ఏర్పాటుచేయాలన్నారు. డీఆర్‌డీఓ సన్యాసయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నవీన్‌బాబు, అడిషనల్ డీఆర్‌డీఓ నూరుద్దీన్ పాల్గొన్నారు. కాగా, ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో టెలీ మానస్, టోల్‌ప్రీ నంబర్ 14416, యాంటీ డ్రగ్స్ టోల్ ప్రీ నంబర్ 1908పై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకతపై అదనపు కలెక్టర్ శ్రీజ అధికారులతో సమీక్షించారు. డీఐఈఓ రవిబాబు, డీఎంహెచ్‌ఓ కళావతిబాయి, యాంటీ డ్రగ్స్ విభాగం సీఐ రాము పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment