
క్లినికల్ అప్రెంటిస్‌షిప్ శిక్షణకు దరఖాస్తులు
ఖమ్మంసహకారనగర్: ఇంటర్మీడియట్ ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఫీమేల్) ఒకేషనల్ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన వారు ఏడాది పాటు క్లినికల్ అప్రెంటిస్ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె.రవిబాబు తెలిపారు. కొత్త వారితో పాటు గతంలో దరఖాస్తు చేసుకుని ఎంపిక కాని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. సత్తుపల్లి, మధిర, తిరుమలాయపాలెం ఏరియా ఆస్పత్రుల్లో శిక్షణ ఉంటుందని, ఎంపికై న వారు రూ.వెయ్యి డీడీ సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు బయోడేటా ఫారం, సర్టిఫికెట్ల జిరాక్స్‌లకు రూ.10 పోస్టల్ స్టాంప్ అతికించిన సొంత చిరునామా కవర్‌ను జతపరిచి కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో ఈనెల 23వ తేదీలోగా అందజేయాలని డీఐఈఓ సూచించారు.
అందుబాటులో
మామిడి మొక్కలు
కూసుమంచి: కూసుమంచి మండలం చేగొమ్మలోని ఉద్యానశాఖ నర్సరీలో అంటు మామిడి మొక్కలు అందుబాటులో ఉన్నాయని ఉద్యాన అధికారి అపర్ణ తెలిపారు. బంగినపల్లి, తోతాపురి, హిమాయత్ తదితర రకాల మొక్కలు పంపిణీ చేయనున్నామని వెల్లడించారు. రైతులు ఒక్కో మొక్కకు రూ.40 చెల్లించాల్సిఉంటుందని తెలిపారు. ఈమేరకు ఆసక్తి ఉన్న వారు వివరాల కోసం 89777 14104 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
మైనార్టీ మహిళలకు ఉచిత కుట్టుమిషన్లు
ఖమ్మంమయూరిసెంటర్: తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఇందిరమ్మ మహిళాశక్తి పథకం కింద మైనార్టీ మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ చేయనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కె.సత్యనారాయణ తెలిపారు. ముస్లిం, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు tgobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిరుపేద, నిరాశ్రయులు, వితంతువు, భర్త విడాకులు ఇచ్చిన మహిళలు, అనాథ, ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఉంటుందని, తెల్ల రేషన్ కార్డు, ఆహార భద్రత కార్డు ఉన్న వారు అర్హులని తెలిపారు. కార్డు లేకపోతే ఆదాయ ధ్రువపత్రం సమర్పించాలని సూచించారు. అంతేకాక నివాసం, వయస్సు ధ్రువీకరణ కోసం ఆధార్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, మైనార్టీ కార్పొరేషన్ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ ద్వారా టైలరింగ్ నేర్చుకున్న సర్టిఫికెట్, కనీసం ఐదో తరగతి విద్యార్హత కలిగిన వారు గతంలో ఎలాంటి లబ్ధి పొందలేదని సెల్ఫ్ డిక్లరేషన్ అందజేయాలని తెలిపారు. ఈమేరకు ఆన్‌లైన్ దరఖాస్తుతో పాటు ధ్రువపత్రాలను జతచేసి కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో సమర్పించాలని, వివరాలకు 97040 03002 నంబర్‌లో సంప్రదించాలని సత్యనారాయణ సూచించారు.
రేపు ఖమ్మంలో జాబ్ మేళా
ఖమ్మం రాపర్తినగర్: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈనెల 20న శుక్రవారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఖమ్మం జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఎన్.మాధవి తెలిపారు. ఖమ్మం టేకులపల్లిలోని మోడల్ కెరీర్ సెంటర్‌లో జరిగే జాబ్‌మేళాలో హెటిరో నెక్సిటీ, ముత్తూట్ మైక్రోఫిన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు అర్హులను ఎంపిక చేస్తారని వెల్లడించారు. ఇందులో ఎంపిౖకైన వారికి రూ.10వేల నుంచి రూ.35వేల వరకు వేతనం అందుతుందని తెలిపారు. 18 నుండి 30 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఇంటర్, ఐటీఐ ఫిట్టర్, ఎలక్ట్రికల్, మెకానికల్, కెమికల్ డిప్లొమా, ఎంబీఏ, పూర్తి చేసిన వారు విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్‌లతో హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాల కోసం 81210 40350, 99660 77622 నంబర్లలో సంప్రదించాలని ఆమె తెలిపారు.
26న డాక్ అదాలత్
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం డివిజన్ స్థాయి డాక్ అదాలత్‌ను ఈనెల 26న నిర్వహిస్తున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి తెలిపారు. సిబ్బందితో పాటు సేవా సమస్యలు, పెండింగ్ సమస్యలను ఇందులో పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఆన్‌లైన్ విధానంలో డాక్ అదాలత్ నిర్వహించనుండగా సమస్యలను ఈనెల 24వ తేదీలోగా చేరేలా పంపించాలని సూచించారు. సమస్యలతో పాటు ఫోన్ నంబర్లను కూడా పంపించాలని, అదాలత్ నిర్వహించే సమయాన ఆన్‌లైన్‌లో బాధితులను కూడా చేర్చి చర్చిస్తామని తెలిపారు.

క్లినికల్ అప్రెంటిస్‌షిప్ శిక్షణకు దరఖాస్తులు
Comments
Please login to add a commentAdd a comment