మృతులు దుమ్ముగూడెం వాసులు
ఎటపాక (అల్లూరిజిల్లా): మండలంలోని నవోదయ పాఠశాల సమీపంలో జామాయిల్ కర్రలోడు ట్రాక్టర్ ఢీకొని దంపతులు దుర్మరణం చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. సీఐ కన్నపరాజు కథనం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని మారాయిగూడెం పంచాయతీ భీమవరం గ్రామానికి చెందిన సోయం రాంబాబు(45), ముత్యాలమ్మ (40) ద్విచక్రవాహనంపై భద్రాచలం వచ్చారు. పని ముగించుకుని ఎటపాక మండలం బొజ్జిగుప్ప గ్రామం మీదుగా స్వగ్రామానికి వస్తున్నారు. జామాయిల్ కర్రలోడుతో ట్రాక్టర్ భద్రాచలం వస్తోంది. సింగిల్‌రోడ్డు కావడంతో వారు నవోదయ పాఠశాల సమీపంలో ట్రాక్టర్‌ను దాటి వెళ్లేక్రమంలో కర్ర ద్విచక్రవాహనానికి తగలడంతో దంపతులు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108 ద్వారా భద్రాచలం ఏరియా ఆస్పత్రికికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment