రోడ్డు ప్రమాదంలో యువకుడు...
మధిర: మధిరలోని శాంతి థియేటర్ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దాములూరి రోహన్‌సాయి (18) మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి.. ఎనిమిదో వార్డుకు చెందిన రోహన్‌సాయి, గౌస్‌పాషా, అశోక్ బైక్‌పై వెళ్తూ మరో బైక్‌ను ఢీకొట్టి.. అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. గాయపడిన వారిని ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో రోహన్‌సాయి మృతిచెందాడు. గౌస్ పాషా ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అశోక్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మరోబైక్‌పై వెళ్తున్న శ్రీనివాస్‌కు ప్రాణాపాయం తప్పింది. మధిర టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment