నిల్వ చేసిన ఇసుక సీజ్
మధిర: మండలంలోని మహదేవపురం గ్రామంలోని ఓవర్ హెడ్ ట్యాంకు వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను ఆదివారం తహసీల్దార్ రాళ్లబండి రాంబాబు సీజ్ చేశారు. అనుమతి లేని మహదేవపురం ఇసుక రేవు నుంచి కొంతమంది అక్రమంగా ఇసుకను తరలించి నిల్వ చేస్తున్నట్లు రెవెన్యూ అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో తహసీల్దార్ రాంబాబు విచారణ నిర్వహించి నిల్వ చేసిన ఇసుకకు బౌండరీ గీసి సీజ్ చేసినట్లు తెలిపారు.
లారీ, బైక్ ఢీ.. ఒకిరికి గాయాలు
కొణిజర్ల: కంటైనర్, ద్విచక్రవాహనం ఢీకొని ఓ వ్యక్తి గాయపడిన ఘటన ఆదివారం మండలంలోని తనికెళ్ల సమీపంలో చోటుచేసుకుంది. చింతకాని మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన చర్లపల్లి వెంకటేశ్ ఖమ్మంలో పనిచేస్తున్నాడు. ఆదివారం తన అత్తగారి ఇంటికి (కొణిజర్ల) వచ్చి భోజనం చేసి తిరిగి తన ద్విచక్ర వాహనంపై ఖమ్మం వెళ్తుండగా తనికెళ్ల చివరన రాజస్తానీ దాబాలోకి వెళ్లేందుకు మళ్లుతున్న కంటైనర్ లారీ వెనక వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్రవాహనం లారీ కింద పడి నుజ్జునుజ్జయింది. వెంకటేశ్‌ను స్థానికులు ఖమ్మం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరికి...
చండ్రుగొండ: మండలంలోని గానుగపాడు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యా యి. వివరాలిలా ఉన్నాయి.. జూలూరుపాడు మండలంలోని పడమటనర్సాపురం గ్రామానికి చెందిన కట్రం నర్సింహారావు, ఇనగంటి మురళి ద్విచక్రవాహనంపై చండ్రుగొండకు వచ్చి తిరిగి వెళ్తున్నారు. మార్గమధ్యలో గానుగపాడు వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి పడిపోయింది. గాయపడిన మురళిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
విద్యుదాఘాతంతో బాలికకు...
అశ్వారావుపేటరూరల్: విద్యుదాఘాతంతో ఓ బాలికకు తీవ్ర గాయాలు కాగా, పరిస్థితి విషమంగా మారింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని ఊట్లపల్లి కి చెందిన 13ఏళ్ల కేతా లాస్య ఆదివారం సాయంత్రం బట్టలు ఆరేసేందుకు బిల్డింగ్‌పైకి వెళ్లింది. తడి బట్టలు ఆరేసే క్రమంలో 33 కేవీ విద్యుత్ వైర్లు తగిలి విద్యుదాఘాతానికి గురి కాగా, తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబీకులు బాలికను అశ్వారావుపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించగా, బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment