చింతకానిలో బర్డ్‌ఫ్లూ కలకలం
చింతకాని: మండలంలోని ప్రొద్దుటూరు, లచ్చగూడెం గ్రామాల్లో బర్డ్‌ఫ్లూ వైరస్‌తో కోళ్ల ఫారంలోని వందలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. గ్రామాల్లో ఏర్పాటు చేసుకున్న కోళ్ల ఫారంలలో పెంచుతున్న కోళ్లు బర్డ్‌ఫ్లూ వైరస్ సోకి రోజూ సుమారు 700 కోళ్లు మృతి చెందుతున్నాయని ఫారం నిర్వాహకులు ఉమ్మనేని లక్ష్మయ్య, అప్పన రమేశ్, సురేశ్ తెలిపారు. పశుసంవర్థక శాఖాధికారులకు చెప్పినా పట్టించుకోవటం లేదని వాపోయారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. బ్యాంక్‌లో రుణాలు తీసుకుని కోళ్ల ఫారంలను నిర్వహిస్తున్నామని, బర్డ్‌ఫ్లూ వైరస్‌తో ఫారంలోని కోళ్లు చనిపోతుండటంతో లక్షల్లో నష్టం వాటిల్లితుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా పశుసంవర్థకశాఖ అధికారులు పరీక్షలు నిర్వహించి వైరస్‌ను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
మృత్యువాత పడుతున్న కోళ్లు
Comments
Please login to add a commentAdd a comment