ప్రశాంతంగా ముగిసిన ప్రవేశ పరీక్ష
రఘునాథపాలెం: గిరిజన గురుకుల విద్యాలయాల్లో నీట్ జేఈఈ శిక్షణ కోసం కేటాయించిన కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో 2025 – 26 విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం నిర్వహించిన పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో ప్రవేశానికి స్క్రీనింగ్ (ప్రవేశ) పరీక్ష మండల కేంద్రమైన రఘునాథపాలెంలోని గిరిజన గురుకుల ప్రతిభ పాఠశాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది. పరీక్షకు 430 మంది విద్యార్థులకు గాను 412 మంది హాజరయ్యారని ప్రిన్సిపాల్ మల్లెల బాలస్వామి తెలిపారు. పరిశీలకులుగా సింగరేణి గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ హరికృష్ణ వ్యహరించారు.
Comments
Please login to add a commentAdd a comment