అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
తిరుమలాయపాలెం: మండలంలోని ఏలువారిగూడెం – మేడిదపల్లి గ్రామాల మధ్యలో ఎస్సారెస్పీ కాల్వ కట్టపై ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పాతర్లపాడు గ్రామానికి చెందిన కోల సైదులు (41) మేళం వాయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 14న బ్యాండ్ మేళం వాయించే పని ఉందని భార్య ఉషకు చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. 15న ఉదయం భార్యతో ఫోన్‌లో మాట్లాడగా ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. ఆదివారం ఉదయం మేడిదపల్లి సమీపంలోని ఎస్సారెస్పీ కాలువపై సైదులు అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉన్నట్లు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న సైదులు భార్య ఉష ఘటనా స్థలానికి చేరుకుని తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ కూచిపూడి జగదీశ్ ఘటనా స్థలానికి వెళ్లి విచారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి ఇద్దకు కుమార్తెలున్నారు.
Comments
Please login to add a commentAdd a comment