పాఠశాలలో ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం సమయా ల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. తరగతులు మాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మాకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకుంటున్నాం. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మా వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్నారు. ప్రత్యేక తరగతుల్లో శ్రద్ధగా చదువుకొని మంచి ఉత్తీర్ణత సాధిస్తామనే నమ్మకం ఉంది. –డి.హిందు,
నాగులవంచ హైస్కూల్, చింతకాని మండలం
మంచి మార్కులు సాధిస్తాం
పదో తరగతి సిలబస్‌ను జనవరిలోనే ఉపాధ్యాయు లు పూర్తి చేశారు. ఆ తర్వాత నుంచి ప్రతి నాలుగు పాఠాలు, ఐదు పాఠాలు మాదిరిగా స్పెషల్ టెస్టులు నిర్వహించారు. స్పెషల్ టెస్ట్‌ల వల్ల పరీక్షల్లో వచ్చే ప్రశ్నలను ముందుగానే అవగాహన చేసుకుని మంచి మార్కులు పొందేందుకు మార్గం దొరికింది. మంచి మార్కులు సాధిస్తామనే నమ్మకం ఉంది.
– యువరాజ్, శాంతినగర్ హైస్కూల్, ఖమ్మం
నూరు శాతం ఫలితాలు సాధించేలా..
జిల్లాలో పదో తరగతి విద్యార్థులు నూరుశాతం ఫలితాలు సాధించేలా కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నాం. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. విద్యార్థులకు సైతం పరీక్షలపై భయం పోగొట్టేలా కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
– సోమశేఖరశర్మ, డీఈఓ, ఖమ్మం
●
Comments
Please login to add a commentAdd a comment