●జొన్నరొట్టె.. కొరివి పచ్చడి!
ప్రేమతో ఏది పెట్టినా పరమాన్నమే అంటున్న మంత్రి పొంగులేటి
రఘునాథపాలెం: ‘జొన్న రొట్టె.. కొరివి పచ్చడి అంటే నాకు ఎంతో ఇష్టం.. ప్రేమతో ఏది పెట్టినా అది పరమాన్నమే’ అన్నారు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆదివారం ఆయన రఘునాథపాలెం మండలం పుటానితండాలో గిరిజన నాయకుడు మూడ్ బాలాజీ కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు అందించిన జొన్నరొట్టె తింటూ అక్కడి నాయకులతో కాసేపు మాట్లాడారు. మంత్రి వెంట మూడ్ చిన్న, వాంకుడోత్ దీపక్, బోడ శ్రావణ్‌కుమార్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment