ఖమ్మం జిల్లాలో 27, భద్రాద్రి జిల్లాలో నాలుగు గ్రామాలను పూర్తి సోలార్ విలేజ్‌లుగా మార్చేందుకు అధికారులు ఎంపిక చేశారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో 22 గ్రామాలు, నేలకొండపల్లి మండలం చెరువుమాధారం, రఘునాథపాలెం మండల కేంద్రం, మధిర మండలం సిరిపురం, ఏన్కూర్ మండలం లచ్చగూడెం, శ్రీరాంగిరి, భద్రాద్రి జిల్లాలో దమ్మపేట మండలం గండుగులపల్లి, దురదపాడు, కె.ఎం.గూడెం, రెడ్డియాలపాడు గ్రామాలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో ప్రతి ఇంటికి 1 కిలోవాట్ నుంచి 3 కిలోవాట్ల వరకు ఉచితంగా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. రైతుల పొలాల్లో 5 హెచ్‌పీ మోటార్‌కు సోలార్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో అధికారులు సర్వే చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment