వెలవెల..
వాతావరణ ం
జిల్లాలో సోమవారం ఉదయం మొదలైన ఎండ మధ్యాహ్నానికి అధికమవుతుంది. రాత్రి వాతావరణం మాత్రం చల్లగా ఉంటుంది.
కళకళ..
తళతళ..
8లో
సోమవారం శ్రీ 17 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
చాలా మంది ఇళ్లలో ఆదివారం వస్తే ముక్క లేనిదే ముద్ద దిగడం కష్టమే. అది చికెన్, మటన్ లేదా చేపలు ఏదో ఒకటి స్తోమత ఆధారంగా ఉండాల్సిందే. ఇటీవల కోళ్లకు వైరస్ సోకుతోందనే ప్రచారం జోరందుకున్న నేపథ్యాన జిల్లాలో ఆ ప్రభావం లేదని అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ జనాన్ని పట్టిన భయం వీడలేదు. ఇంతలోనే ఆదివారం వచ్చింది. అందరికీ అందుబాటు ధరలో ఉండే చికెన్ తెచ్చుకుందామనుకుంటే వైరస్ భయం పట్టి పీడిస్తోంది. ఫలితంగా చేసేదేం లేక కొందరు మటన్, ఇంకొందరు ఉదయం నుంచే చేపల షాపుల వద్ద బారులుదీరారు. అయితే, మాంసాహార ప్రియులు ఎప్పుడూ లేనంతగా వెల్లువెత్తడంతో ఇదే అదునుగా మటన్ ధర రూ.1200కు పెంచగా.. చేపల ధర సైతం కేజీకి రూ.30కి పైగా పెంచినట్లు తెలిసింది. అయినా ముక్క లేనిదే ఆదివారం భోజనం చేయడం కష్టమైన వారంతా తప్పదనుకుని కొనేశారు !
– ఖమ్మంఅర్బన్/చుంచుపల్లి
బర్డ్‌ఫ్లూ కలకలం
చింతకాని మండలం ప్రొద్దుటూరు, లచ్చగూడెం గ్రామాల్లో కోళ్లు మృతి చెందుతుండడంతో బర్డ్ ఫ్లూ నే కారణమని ఆందోళన చెందుతున్నారు.
8లో
న్యూస్‌రీల్
వెలవెల..
వెలవెల..
వెలవెల..
Comments
Please login to add a commentAdd a comment